Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాల్‌పై శివాలెత్తిన రోజా భర్త ఆర్కే సెల్వమణి.. కార్మికుల కడుపు కొడతున్నాడంటూ?

కోలీవుడ్ నిర్మాతల సంఘానికి, కార్మికుల సంఘాని మధ్య విభేదాలు ముదిరిపోతున్నాయి. వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ సినిమా కార్మికులు (ఫిల్మ్ ఎంప్లాయూస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా) ఆందోళనకు దిగింది. దీంతో తమి

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2017 (12:41 IST)
కోలీవుడ్ నిర్మాతల సంఘానికి, కార్మికుల సంఘాని మధ్య విభేదాలు ముదిరిపోతున్నాయి. వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ సినిమా కార్మికులు (ఫిల్మ్ ఎంప్లాయూస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా) ఆందోళనకు దిగింది. దీంతో తమిళనాడులో షూటింగ్‌లు ఆగిపోయాయి. వీరి డిమాండ్లను నిర్మాతల సంఘం తోసిపుచ్చింది. 
 
ఈ నేపథ్యంలో కార్మికుల సంఘంలో లేనివారితో షూటింగ్‌లు చేసుకోవాలని నిర్మాతల మండలి అధ్యక్షుడు, హీరో విశాల్ సలహా ఇచ్చాడు. దీనిపై వైకాపా ఎమ్మెల్యే రోజా భర్త, కార్మికుల సంఘం అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి మండిపడ్డారు. విశాల్ సలహా కార్మికుల పొట్ట కొట్టే విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
కాగా.. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన కార్మికుల సంఘం ఆందోళనతో దాదాపు 25 వేల మంది సిబ్బంది షూటింగ్‌లకు దూరమైయ్యారు దీంతో 20 సినిమా షూటింగ్‌లు ఆగిపోయాయి. ఇందులో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కాలా సినిమా కూడా వుండటం గమనార్హం. 
 
సినిమాటోగ్రఫీ, కొరియోగ్రఫీ, స్టంట్ డైరక్షన్‌కు చెందిన కార్మికులు షూటింగ్‌ల్లో పాల్గొన్నప్పటికీ.. కార్మికుల సంఘాలు సమ్మె బాట పట్టడంతో షూటింగ్‌లకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితి రావడం దారుణమని.. విశాల్ నిర్ణయాలు కార్మికులకు అనుకూలంగా లేవని ఆర్కే సెల్వమణి మండిపడ్డారు. కార్మికుల డిమాండ్లను నెరవేర్చేందుకు నిర్మాతల సంఘం సిద్ధం కావాలన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments