Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్.బి శ్రీరామ్ ఎందుకు సినిమాలు చేయ‌డం లేదు... అస‌లు ఏమైంది..?

Webdunia
శనివారం, 7 సెప్టెంబరు 2019 (17:40 IST)
చాలా బాగుంది సినిమా ద్వారా హాస్య‌న‌టుడుగా ప‌రిచ‌య‌మై తొలి చిత్రంతోనే మంచి క్రేజ్ ఏర్ప‌రుచుకున్న రైట‌ర్ ట‌ర్న్‌డ్ యాక్ట‌ర్ ఎల్.బి. శ్రీరామ్. హాస్యంతో పాటు ఎమోష‌నల్ సీన్స్‌లో సైతం అద్భుతంగా న‌టించి మెప్పించారు. ఇంకా చెప్పాలంటే... క్యారెక్టర్ ఏదైనా మనసుకు గుర్తిండిపోయేలా నటించడం ఎల్బీ శ్రీరామ్ ప్రత్యేకత. ఎన్నో సినిమాల్లో నటించి, కథా రచయితగా కూడా పని చేసిన ఆయన గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 
 
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎల్బీ శ్రీరామ్ ప్రస్తుతం సినిమాల్లో నటించకపోవడానికి గల కారణాలను తెలియజేశారు. ఇంత‌కీ ఆయ‌న ఏం చెప్పారంటే... చాలావరకు నాతో కాంబినేషన్ సెట్టయ్యే కమెడియన్స్ ఇప్పుడు లేరు. గతంలో 10 సినిమాలు చేస్తే అందులో రెండు సెంటిమెంట్ పాత్రల్లో నటించే అవకాశం వచ్చేది. కామెడీ ట్రాక్‌లు ఇప్పుడు కనిపించడం లేదు. చాలా వరకు జనాలు నన్ను కమెడియన్‌గా మర్చిపోవడంతో ఎమోషనల్‌గా ఉండే పాత్రలకు పిలుస్తున్నారు.
 
అలాంటి పాత్రలు చేసిచేసి విరక్తి వచ్చి అవకాశాలు వచ్చినా కూడా చేయనని చెప్పేశాను. డిఫరెంట్‌గా ఉండే రోల్స్ ఆఫర్ చేస్తే తప్పకుండా నటిస్తా అంటూ ఆయ‌న సినిమాల్లో న‌టించ‌క‌పోవ‌డానికి గ‌ల కార‌ణాన్ని బ‌య‌టపెట్టారు ఎల్బీ శ్రీరామ్. మ‌రి... ఆయ‌న కోరుకున్న‌ట్టుగా డిఫ‌రెంట్ రోల్స్ అవ‌కాశాలు అందిపుచ్చుకుని అల‌రిస్తార‌ని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments