Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి అస్థికలను రామేశ్వరానికి తర్వాత హరిద్వార్‌లో ఎందుకు కలిపారో తెలుసా?

అతిలోక సుందరి శ్రీదేవి ఫిబ్రవరి 24న ప్రమాదవశాత్తు దుబాయ్ హోటల్‌లోని బాత్‌టబ్‌లో పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. మూడు రోజుల తర్వాత శ్రీదేవి మృతదేహాన్ని ముంబైకి తీసుకొచ్చిన బోనీ కపూర్ కుటుంబీకులు.. ఫిబ

Webdunia
శుక్రవారం, 9 మార్చి 2018 (16:48 IST)
అతిలోక సుందరి శ్రీదేవి ఫిబ్రవరి 24న ప్రమాదవశాత్తు దుబాయ్ హోటల్‌లోని బాత్‌టబ్‌లో పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. మూడు రోజుల తర్వాత శ్రీదేవి మృతదేహాన్ని ముంబైకి తీసుకొచ్చిన బోనీ కపూర్ కుటుంబీకులు.. ఫిబ్రవరి 28వ తేదీన శ్రీదేవి భౌతికకాయానికి అంత్యక్రియలు చేశారు. ఈ నేపథ్యంలో దివంగత నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ ఆమె అస్థికలను ముందు రామేశ్వరంలోను.. ఆ తర్వాత హరిద్వార్‌లో కలిపారు. 
 
అయితే శ్రీదేవి అస్థికలను రెండు చోట్ల కలిపేందుకు కారణముందని బోనీ సన్నిహితులు మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. 1993లో శ్రీదేవి ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా హరిద్వార్ వెళ్లారట. కానీ షూటింగ్‌లో బిజీగా వుండి హరిద్వార్‌ను శ్రీదేవి దర్శించుకోలేకపోయారని.. మళ్లీ హరిద్వార్‌ వస్తానని మొక్కుకున్నారు. కానీ ఇప్పటివరకు శ్రీదేవికి హరిద్వార్ వెళ్లే అవకాశం దక్కలేదట.
 
అందుకే శ్రీదేవి నెరవేరని కోరికను.. ఆమె అస్థికలను హరిద్వార్‌లోని గంగానదిలో కలపడం ద్వారా బోనీ కపూర్ నెరవేర్చారని సన్నిహితులు చెప్తున్నారు. తొలుత ఆమె అస్థికలను తమిళనాడులోని రామేశ్వరంలో కలిపారు. ఈ కార్యక్రమానికి బోనీ కపూర్‌తో పాటు కుమార్తెలు జాన్వి, ఖుషి కూడా వెళ్లారు. ఆపై హరిద్వార్‌లో నిర్వహించిన కార్యక్రమానికి బోనీతో పాటు అనిల్‌కపూర్‌, కరణ్‌ జోహార్‌, శ్రీదేవి స్నేహితుడైన ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీశ్‌ మల్హోత్రా కూడా వెళ్లారు. 
 
పిండ ప్రదానం చేస్తున్న సమయంలో బోనీ కపూర్‌ కన్నీటిపర్యంతం అయ్యారు. కాగా శ్రీదేవి ''మామ్‌'' సినిమాతో ఆమె సినీ ప్రస్థానానికి ముగింపు పలికి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఇంకా శ్రీదేవి పెద్ద కూతురు జాన్విని వెండితెరపై చూసుకోకుండానే మృతిచెందడం బాధాకరమని సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments