Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచి చేయాలనుకునే కల్యాణ్ గారికి విషెస్: రేణూ దేశాయ్ పోస్ట్

ఐవీఆర్
బుధవారం, 12 జూన్ 2024 (15:44 IST)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి రేణూ దేశాయ్ శుభాకాంక్షలు తెలిపారు. తన పిల్లలు అకీరా, ఆద్యలిద్దరూ తన తండ్రి ప్రమాణోత్సవానికి వెళ్లారనీ, అక్కడి నుంచి వీడియో కాల్ చేసారంటూ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేస్తూ... వాళ్ల నాన్న బిగ్గెస్ట్ డేకి రెడీ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మంచి చేయాలనుకునే కల్యాణ్ గారికి శుభాకాంక్షలు" అని పోస్ట్ చేసారు.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)

నీ తమ్ముడు తుఫాన్...
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరే క్రమంలో బుధవారం ఉదయం చంద్రబాబు నాయుడు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసారు. ఈ వేడుకకు కేంద్రమంత్రులు, దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంకా ఎందరో సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ వేడుకలో ప్రమాణ స్వీకారం వేడుక ముగిసాక ప్రధానమంత్రి నరేంద్ర మోడి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలిసి నేరుగా మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లారు.
 
ఆయనను పలుకరిస్తూ... నీ తమ్ముడు తుఫాన్ అంటూ నవ్వుతూ ఇరువురు చేతులను పట్టుకుని పైకి లేపి ప్రజలకు అభివాదం చేసారు. ఈ అరుదైన ఘట్టాన్ని చూసిన మెగా ఫ్యాన్స్ సంతోషంతో హర్షధ్వానాలు చేసారు. కాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి మంత్రివర్గంలో కీలక పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

పెళ్లి కాలేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments