Webdunia - Bharat's app for daily news and videos

Install App

అశ్లీల చిత్రంలో నటించిన హీరోయిన్... హేళన చేశారని...

Webdunia
శుక్రవారం, 30 నవంబరు 2018 (11:02 IST)
సినిమా జీవితం ఓ రంగుల కల. అవకాశాలు వచ్చినప్పుడు ఎలా వెలిగిపోతారో... అవకాశాలు రాకపోతే అలాగే నలిగిపోతారు. సినీ ఇండస్ట్రీలో అనేకమంది ఛాన్సుల్లేక విలవిల్లాడేవారున్నారు. కొందరు తాము ఎంచుకున్న దారిని వదల్లేక మరో వృత్తిలో ఇమడలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా కోలీవుడ్ వర్థమాన నటి రియామిక కూడా అలాగే బలవంతంగా తన ప్రాణం తీసుకుంది. 
 
ఆమె ఆత్మహత్య చేసుకోవడం వెనుక కారణం ఏంటి అని పరిశీలిస్తే... చెన్నైలో చదువుకుంటూ సినిమాల్లో నటించాలని కలలు కన్న 26 ఏళ్ల రియామిక తన పిన్ని కొడుకు ప్రకాష్‌తో కలిసి వలసరవాక్కంలో అద్దె ఇంట్లో వుంటోంది. ఈ క్రమంలో ఆమెకి జిమ్ ట్రయినర్ అయిన దినేష్ అనే యువకుడితో ఆమె ప్రేమలో పడింది. ప్రేమలో పడింది కానీ సినిమాల్లో అవకాశాలు మాత్రం అంతంతమాత్రంగానే వస్తున్నాయి. 
 
రెండుమూడు చిత్రాల్లో నటించినా ఆమెకు తగిన గుర్తింపు రాలేదు. దీనితో ఆమెకు ఆర్థిక కష్టాలు ఎదురయ్యాయి. మరోవైపు తన కుటుంబం మొత్తం ఆమె సంపాదన పైనే ఆధారపడి బతుకుతోంది. ఈ స్థితిలో ఏం చేయాలో అర్థంకాక డబ్బు కోసం ఓ అశ్లీల చిత్రంలో నటించింది. ఈ చిత్రాన్ని చూసిన పలువురు... ఇక నువ్వు అలాంటి చిత్రాల్లో నటించాల్సిందే... నీకు హీరోయిన్ ఛాన్స్ వచ్చే అవకాశం లేదని హేళన చేయడం మొదలుపెట్టారు. వారి హేళనను తట్టుకోలేని రియామిక బుధవారం రాత్రి తన ఇంట్లోనే ఫ్యానుకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో మహిళ హత్య

Pankaja Sri: వంశీకి హైపోక్సియా ఉంది.. జైలులో వుండలేరు.. భార్య పంకజ శ్రీ

అమర్నాథ్ యాత్ర కోసం 3 లక్షల 60 వేల మంది భక్తులు రిజిస్ట్రేషన్, యుద్ధమేఘాల మధ్య సాధ్యమేనా?

బీజేపీ నేత సుజనా చౌదరికి తీవ్ర గాయాలు... ఎలా?

ఒకే ఒక్క దెబ్బకి గోడకి కరుచుకున్నాడు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments