బంగారూ... నీ ఒంటి రంగుకు ఈ గళ్లచీర అంత బావుండదేమోనే...? అన్నాడు సుశాంత్ కానీ.. ఆ స్టీలు సామాన్లవాడికి ఇలాంటివే బాగా నచ్చుతాయండీ..!! ఉడికిస్తూ అంది సుజిత. అదేంట్రా...! పడుకునేముందు షోగ్గా తయారయి మరీ పడుకుంటున్నావు.. ఎంటి సంగతి...? కళ్లెగరేస్తూ అడిగాడు రాజేష్ అదేం లేదురా...! కలలో కన్పించే అమ్మాయిలకు నేను అందంగా కనిపించాలి కదా... అందుకని....! అసలు విషయం చెప్పాడు సుమన్....