Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనతా హోటల్ టీజర్: అతను ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. కానీ..

ప్రేమిస్తే, షాపింగ్ మాల్, జర్నీ లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించిన సురేష్ కొండేటి ఇప్పుడు మరో చక్కటి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ‘మహానటి’ ఫేం దుల్కర్ సల్మాన్, టాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్ జంటగా నటించిన చిత్రం ఉస్తాద్ హోట

Webdunia
శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (19:46 IST)
ప్రేమిస్తే, షాపింగ్ మాల్, జర్నీ లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించిన సురేష్ కొండేటి ఇప్పుడు మరో చక్కటి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ‘మహానటి’ ఫేం దుల్కర్ సల్మాన్, టాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్ జంటగా నటించిన చిత్రం ఉస్తాద్ హోటల్. మళయాలంలో ఘన విజయం సాధించిన ఈ సినిమాను సురేష్ కొండేటి తెలుగులో ‘జనతా హోటల్’  పేరుతో విడుదల చేస్తున్నారు. 
 
ఈ నెల 14న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఎప్పుడూ విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న సురేష్ కొండేటి.. ఈ సినిమా విషయంలో మరింత వైవిధ్యాన్ని ప్రేక్షకులకు అందించబోతున్నారు. మరో 7 రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్‌ను రోజుకో టీజర్ చొప్పున ఏడు రోజుల పాటు విడుదల చేయనున్నారు. అందులో భాగంగా నేడు మొదటి టీజర్ విడుదలైంది.
 
మగ పిల్లాడు కావాలనుకున్న ఓ తండ్రికి వరుసగా నలుగురు ఆడపిల్లలు పుట్టడం.. అయినా ఆశ చంపుకోని అతడికి ఎట్టకేలకు ఐదో సంతానంగా మగ పిల్లాడు పుట్టడం.. ఆ పిల్లవాడు తండ్రికి నచ్చింది కాకుండా.. తనకు నచ్చింది చేయడం.. చివరికి పెళ్లిచూపుల్లో తన క్వాలిఫికేషన్ గురించి అమ్మాయి అడిగితే.. తాను విదేశాలకు వెళ్లి చదివింది చెఫ్ కోర్సు మాత్రమేనని చెప్పడం.. ఇలా ఆద్యంతం ఆసక్తి రేకెత్తిస్తున్న సన్నివేశాలతో టీజర్ ఆకట్టుకుంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Musical Rock: వరంగల్: నియోలిథిక్ యుగం నాటి శిలా కళాఖండాన్ని కనుగొన్నారు..

శామీర్‌పేట ఎస్ఐ అతి తెలివి... చెత్త డబ్బాలో లంచం డబ్బు.. మాటువేసి పట్టుకున్న ఏసీబీ!!

తిరుమలలో గదుల బుకింగ్ ఇంత సులభమా? (Video)

క్షణికావేశం... భార్యకు కూల్‌డ్రింక్‌లో విషం కలిపిచ్చి తాను తాగాడు...

Andhra Pradesh: మోదీకి ఘన స్వాగతం పలకాలి.. బహిరంగ సభను విజయవంతం చేయాలి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments