Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాప్సి కథానాయికగా ‘గేమ్ ఓవర్’ రిలీజ్ డేట్ ఫిక్స్..!

Webdunia
గురువారం, 6 జూన్ 2019 (19:41 IST)
ప్రముఖ కథానాయిక ‘తాప్సి’ ప్రధాన పాత్రలో ‘గేమ్ ఓవర్’ పేరుతో ప్రముఖ తెలుగు, తమిళ చిత్రాల నిర్మాణ సంస్థ ‘వై నాట్ స్థూడియోస్’ నిర్మిస్తున్న చిత్రం ఇది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1200కు పైగా స్క్రీన్స్‌లో తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఏక కాలంలో జూన్ 14న విడుదలవుతోందని చిత్ర నిర్మాతలు ఎస్. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర తెలిపారు. 
 
ఇంతకుముందు విడుదలయిన చిత్రం టీజర్, కొద్దిరోజుల క్రితం విడుదల అయిన 'గేమ్ ఓవర్' సినిమా థియేట్రికల్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అనూహ్యమైన స్పందన లభించింది. 
 
మూడు భాషల్లో ని  నటీనటులు, రచయితలు, దర్శకులు చిత్ర ప్రముఖులు 'గేమ్ ఓవర్' ట్రైలర్‌ను చూసి ప్రశంశలతో ట్వీట్స్ చేయటంతో ప్రేక్షకులలో ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగాయి. 
 
ప్రముఖ బాలీవుడ్ రచయిత, దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రానికి హిందీలో సమర్పకుడుగా వ్యవహరిస్తూ ఉండటం మరో విశేషం.. తాప్సి ప్రధాన పాత్రలో, ఇంతవరకూ భారతీయ సినీ చరిత్రలో ఎప్పుడు రాని సరికొత్త కధాంశంతో తెరకెక్కింది ఈ చిత్రం. వెన్నులో వణుకు పుట్టించే కథ, కథనాలు ఈ థ్రిల్లర్ మూవీ సొంతం. సినిమా ప్రోమోషన్లో భాగంగా త్వరలో నాయిక తాప్సి తెలుగు మీడియాను కలువనున్నారు. తమ సంస్థ గతంలో నిర్మించిన ‘లవ్ ఫెయిల్యూర్’, ‘గురు’ చిత్రాల విజయాల సరసన ఈ 'గేమ్ ఓవర్' నిలుస్తుందని అన్నారు నిర్మాత ఎస్.శశికాంత్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

OTTs : పాకిస్తాన్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను బంద్ చేయాలి.. కేంద్రం ఆదేశం

Operation Sindoor: 100 మందికి పైగా ఉగ్రవాదులు హతం.. ఆపరేషన్ ఆగదు

Pawan Kalyan: ప్రధాని మోదీని అనికేత్ అని వర్ణించిన పవన్ కల్యాణ్..

Lahore: లాహోర్‌లో శక్తివంతమైన పేలుళ్లు- భద్రత కట్టుదిట్టం

Balochistan: బలూచిస్తాన్‌లో 14మంది పాకిస్థాన్ సైనికులు మృతి.. బాధ్యత వహించిన బీఎల్ఏ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments