Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌండ్ పార్టీ మరో మ‌రో జాతిర‌త్నాలు కాబోతుందా!

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2023 (16:26 IST)
sampathnadi with sound party team
బిగ్ బాస్ తెలుగు 5 టైటిల్ విన్న‌ర్ వీజే స‌న్నీ హీరోగా  ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై, ప్రొడక్షన్ నెంబ‌ర్-1గా రూపొందుతోన్న చిత్రం `సౌండ్ పార్టీ.  హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్.  రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర  నిర్మాత‌లు. జయ శంకర్ సమర్పణ.  సంజ‌య్ శేరి ద‌ర్శ‌కుడు.  ఈ చిత్రం  పోస్ట్ ప్రొడ‌క్ష‌న్  కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని సెప్టెంబ‌ర్ లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.  ఈ సంద‌ర్భంగా ఈ రోజు ప్ర‌సాద్ ల్యాబ్స్ లో  డైర‌క్ట‌ర్ సంప‌త్ నంది చేతుల మీదుగా `సౌండ్ పార్టీ` టీజ‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మం జ‌రిగింది.
 
ఈ సంద‌ర్భంగా సంప‌త్  నంది మాట్లాడుతూ...``నేను కూడా గ‌తంలో కొన్ని చిత్రాల‌కు స‌మ‌ర్ప‌కుడుగా వ్య‌వ‌హ‌రించాను. అదే బాట‌లో జ‌య‌శంక‌ర్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడుగా వ్య‌వ‌హరిస్తున్నాడు.  ఈ ట్రెడిష‌న్ ని ఇలాగే కొన‌సాగించాల‌ని కోరుకుంటున్నా.  `సౌండ్ పార్టీ` టీజ‌ర్ బావుంది. అలాగే మోహిత్ చేసిన మ్యూజిక్ కూడా చాలా బావుంది. ఈ చిత్రం మ‌రో జాతిర‌త్నాలు సినిమాలా ఉండ‌బోతున్న‌ట్లు టీజ‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. వీజే స‌న్నికి ఇది మంచి సినిమా అవుతుంది అన్నారు.
 
 నిర్మాత రవి పోలిశెట్టి మాట్లాడుతూ,  సెప్టెంబర్ లో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. యంగ్ టాలెంట్ ని ఎంక‌రేజ్ చేస్తూ న్యూ ఏజ్ స్టోరీస్ తో సినిమాలు చేయాల‌న్న సంక‌ల్పంతో ఫుల్ మూన్ ప్రొడ‌క్ష‌న్స్ స్థాపించాము. ఇక మీద‌ట కంటిన్యూయ‌స్ గా మా బేన‌ర్ నుండి సినిమాలు వస్తాయ‌న్నారు.  
 
స‌మ‌ర్ప‌కుడు జ‌య‌శంక‌ర్ మాట్లాడుతూ, ఇటీవ‌ల మా చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత గారి చేతుల మీదుగా లాంచ్ చేశాము. దానికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే ఈ రోజు సంప‌త్ నంది గారు వ‌చ్చి మా `సౌండ్ పార్టీ` సినిమా టీజర్ లాంచ్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాను ఆద‌రిస్తే ఒక జంధ్యాల‌, ఈవీవీ గారి త‌ర‌హా చిత్రాలు సంజ‌య్ నుంచి చాలా వ‌స్తాయి.  సినిమాను ఇంత ఫాస్ట్ గా పూర్తి చేయ‌గ‌లిగాము అంటే మా టీమ్ స‌పోర్ట్ ప్ర‌ధాన కార‌ణం అన్నారు.
 
ద‌ర్శ‌కుడు సంజ‌య్ శేరి మాట్లాడుతూ, సౌండ్ పార్టీ మ‌రో జాతిర‌త్నాలు రేంజ్ లో ఉండ‌బోతుంది.  ముఖ్యంగా సినిమాలో స‌న్నీ, శివ‌న్నారాయ‌ణ గారి పాత్ర‌లు విప‌రీతంగా న‌వ్విస్తాయి. 28 రోజుల్లో సినిమాను పూర్తి చేయ‌గ‌లిగాము అంటే  మా టీమ్ స‌పోర్ట్ వ‌ల్లే`` అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌‍కు టమాటా ఎగుమతుల నిలిపివేత.. నష్టాలను భరించే భారత రైతులు నిర్ణయం!!

నీట్ యూజీ పరీక్షపై అసత్య ప్రచారం.. కన్నెర్రజేసిన ఎన్టీయే

అత్తమ్మ కిచెన్ ఆవకాయ అదుర్స్ : ఉపాసన (Video)

Mega DSC: 16,347 పోస్టులలో స్పోర్ట్స్ కోటా కింద 421 పోస్టులు

వైకాపాకు జగన్ అధ్యక్షుడు కాదు.. రాబందుల పార్టీకి చీఫ్ : మంత్రి నిమ్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

తర్వాతి కథనం
Show comments