Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవర సినిమాకు పోటీగా విజయ్ ఆంటోనీ యాక్షన్ థ్రిల్లర్ హిట్లర్

డీవీ
గురువారం, 19 సెప్టెంబరు 2024 (11:03 IST)
vijay anthony-hilter
హీరో విజయ్ ఆంటోనీ తన కొత్త సినిమా "హిట్లర్"తో తెరపైకి రాబోతున్నాడు. గతంలో "విజయ్ రాఘవన్" అనే మూవీని నిర్మించిన చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ తమ 7వ ప్రాజెక్ట్ గా "హిట్లర్" సినిమాను నిర్మిస్తోంది. డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మాతలు. "హిట్లర్" సినిమాను యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ధన రూపొందిస్తున్నారు. "హిట్లర్" సినిమా ఈ నెల 27న హిందీతో పాటు తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. అదేరోజు దేవర కూడా విడుదలకాబోతుంది.
 
"హిట్లర్" ట్రైలర్ ఎలా ఉందో చూస్తే - ఈ ప్రపంచంలో నిజమైన పవర్ అన్నది డబ్బు, అధికారం కాదు ఒక మనిషిని నమ్మి అతని వెనకున్న జనమే అనే పవర్ ఫుల్ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. హీరో విజయ్ ఆంటోనీ డిఫరెంట్ గెటప్స్ లో ఎలాంటి ఆధారాలు దొరక్కుండా ముగ్గురిని కాల్చి చంపేస్తాడు. ఈ తెలివైన క్రిమినల్ కోసం పోలీసులు వేట సాగిస్తుంటారు. యాక్షన్ సీక్వెన్సులతో పాటు తన ప్రేయసితో హీరోకున్న రొమాంటిక్ లవ్ స్టోరీని ట్రైలర్ లో రివీల్ చేశారు.

దశాబ్దాలుగా రాజకీయ క్రీడలో ఆరితేరిన ఓ స్వార్థపూరిత నాయకుడి పాత్రలో చరణ్ రాజ్ కనిపిస్తారు. పొలిటికల్ డ్రామా, యాక్షన్, లవ్ అండ్ రొమాంటిక్ ఎలిమెంట్స్ తో "హిట్లర్" ట్రైలర్ ఇంప్రెస్ చేస్తోంది. విజయ్ ఆంటోనీ పర్ ఫార్మెన్స్, రిచ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్ ట్రైలర్ కు హైలైట్స్ గా నిలుస్తున్నాయి. విజయ్ ఆంటోనీ కెరీర్ లో "హిట్లర్" మరో వైవిధ్యమైన చిత్రంగా ఉండబోతున్నట్లు ట్రైలర్ తో తెలుస్తోంది.
 
 నటీనటులు- విజయ్ ఆంటోనీ, రియా సుమన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వీడి దుంపతెగ... లైవ్ కాన్సెర్ట్‌లోనే కానిచ్చేశాడు.. (Video)

జస్ట్.. 4 రోజుల్లో పాకిస్థాన్ ఫినిష్.. కరాచీలో గురుకులాలు నిర్మించాల్సి వస్తుంది : రాందేవ్ బాబా

A Raja: డీఎంకే ఎంపీ ఎ రాజాకు తప్పిన పెను ప్రమాదం.. ఆ లైటు ఎంపీపై పడివుంటే? (video)

ఇప్పుడే నా కోర్కె తీర్చేందుకు వచ్చేయమన్న ప్రియుడు, ఫోన్ స్విచాఫ్ చేసిన వివాహిత, అంతే...

మహాకాళేశ్వర్ ఆలయంలో అగ్ని ప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments