Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది భరించలేక నేను దుస్తులిప్పేస్తే ఇద్దరు నన్ను వీడియో తీస్కున్నారు...(Video)

Webdunia
సోమవారం, 29 అక్టోబరు 2018 (18:26 IST)
ముంబై మహానగరంలో మేఘా శర్మ అనే యువతి లైంగిక వేధింపులకు గురైంది. తను ఓ భవనం నుంచి వెళ్తున్న సమయంలో సెక్యూరిటీ గార్డు ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఆ అనుభవాన్ని మొత్తం ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
 
" గత రాత్రి నాకు నిద్రలేని రాత్రిగా మిగిలింది. ఓ పురుషుడు నా భవనంలో నన్ను కొట్టి దాడికి యత్నించాడు. ఆ సమయంలో అక్కడ చాలామంది వున్నారు కానీ ఎవరూ అడ్డుకోలేదు. దాంతో నేను పోలీసులకు ఫోన్ చేశాను. పది నిమిషాల్లో వాళ్లక్కడికి వచ్చారు. జరిగిన విషయాన్నంతా చెప్పాను. దాంతో వాళ్లు తమతో పోలీసు స్టేషనుకు రావాల్సిందిగా కోరారు. ఐతే వారి వెంట మహిళా కానిస్టేబుల్ ఎవరూ లేరు. పైగా సమయం అర్థరాత్రి దాటిపోవడంతో నేను మరుసటి రోజు ఉదయం కంప్లైంట్ ఇస్తానన్నాను. 
 
ఐనా పోలీసులు వినిపించుకోలేదు. తమతో పోలీసు స్టేషనుకు రావాల్సిందిగా ఒత్తిడి చేశారు. ఎన్నిసార్లు వారించినా వాళ్లు నన్ను ఒత్తిడి చేస్తూనే వున్నారు. దీనితో తట్టుకోలేక నా దుస్తులు తొలగించేశాను. దాంతో వారిలో కొంతమంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ ఇద్దరు మాత్రం దుస్తులు లేకుండా వున్న నా శరీరాన్ని వీడియో తీసుకుంటూ ముందుకు వచ్చారు. నేను పెద్దగా అరుస్తూ కేకలు వేసి ఏడుస్తూ... ఓ అమ్మాయికి దుస్తులు లేకపోతే ఇలాగే వీడియో తీస్తారా అనేసరికి వాళ్లు కూడా వెళ్లిపోయారు. ఈ చేదు అనుభవం తర్వాత నాకు ఒకటి అర్థమైంది. ఈ దేశంలో మహిళకు రక్షణ లేదు. ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలియాలనే ట్విట్టర్ ద్వారా విషయాన్నంతా మీ ముందుకు తెస్తున్నాను" అంటూ ట్విట్టర్లో పేర్కొంది సదరు యువతి. చూడండి ఆ వీడియో...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

మరో మెగా వారసుడు రానున్నాడా? తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ - లావణ్య

మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు: చిరంజీవి

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం