Webdunia - Bharat's app for daily news and videos

Install App

రండిరా చూసుకుందాం, మీ పెతాపమో మా పెతాపమో? వచ్చిన తాలిబన్లను వచ్చినట్లే చంపేస్తున్నారు

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (19:45 IST)
కాబూల్‌ను ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు మరికొన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. ఎలాగైనా అన్ని ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకుని తమ పాలన సాగించాలని చూస్తున్నారు. కాబూల్ మొత్తం తాలిబన్ల వశం కాగా మిగిలిన ప్రాంతాలపై తాలిబన్లు కన్నేశారు.
 
అందులో పాంజ్‌షీర్ ఒకటి. మొత్తం 150 కిలోమీటర్ల విస్తీర్ణం. చుట్టూ 7 జిల్లాలు, 512 గ్రామాలున్నాయి. లక్షా 50 వేలమంది స్థానికులు నివాసముంటున్నారు. 20 వేలమంది స్త్రీపురుషులు, యువతీయువకులు ఆయుధాలు చేతపట్టుకుని తాలిబన్లు వస్తుంటే చాలు, నల్లిని నలిపేసినట్లు నలిపి చంపేస్తున్నారు. దీనితో తాలిబన్లు ఆ ప్రాంతం లోపలికి వెళ్ళలేకపోతున్నారు. వారు వచ్చే ప్రతి ప్రాంతంలోను స్థానికులు గట్టిగా సమాధానం ఇస్తున్నారు.
 
గ్రామ సరిహద్దు వద్దకు వస్తున్న తాలిబన్లను వచ్చిన వెంటనే చంపేస్తున్నారు. వాళ్లు ఎటువైపు నుంచి వస్తున్నారో, ఎలా చంపుతున్నారో తాలిబన్లకు అంతుచిక్కడం లేదట. ఏ పక్క నుంచి తాలిబన్లు వస్తున్నా లోపలికి మాత్రం రాలేకపోతున్నారు. ఇప్పటి వరకు 800 మంది తాలిబన్లను చంపేశారు. సలే, అహ్మద్ మసూర్ అనే ఇద్దరు వ్యక్తులే ఈ ఆపరేషన్లో కీలకంగా ప్రణాళికలు వేసి దాన్ని అమలు చేస్తున్నారట. 
 
గతంతలో రష్యా, నాటో లాంటి వారు ఈ ప్రాంతంపై దాడి చేసి తమ ఆధీనంలో తీసుకోవాలనుకున్నారు. కానీ అప్పట్లో ఇక్కడివారు సమర్థవంతంగా ఎదుర్కొని వారిని రానివ్వకుండా చేశారు. ఇప్పుడు తాలిబన్లు చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొడుతున్నారు.
 
అత్యాధునికమైన ఆయుధాలతో తాలిబన్లకు చుక్కలు చూపిస్తున్నారట. కాబూల్ వాసులు ఈ విషయం తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారట. అక్కడి స్థానికుల సహకారంతోనే తాలిబన్లను ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. మనం కూడా తాలిబన్లకు ఎదురుతిరిగి పోరాటం చేస్తే పోయేదేముంది పోతే ప్రాణాలేగా, ఎన్నాళ్లీ బానిస బతుకులు అనుకుంటున్నారట. మొత్తమ్మీద ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఇపుడపుడే ప్రశాంత వాతావరణం వచ్చేట్లు కనబడటంలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments