Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి దర్శనం నిలిపివేయడానికి వీల్లేదు.. సీఎం చంద్రబాబు

శ్రీవారి దర్శనంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి 12 యేళ్లకు ఒకసారి జరిగే మహాసంప్రోక్షణ మహాఘట్టం సమయంలో శ్రీవారి దర్శనాన్ని నిలిపివేయాలని తిరుమల తిరుపతి దేవస్థాన పాలక

Webdunia
మంగళవారం, 17 జులై 2018 (11:39 IST)
శ్రీవారి దర్శనంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి 12 యేళ్లకు ఒకసారి జరిగే మహాసంప్రోక్షణ మహాఘట్టం సమయంలో శ్రీవారి దర్శనాన్ని నిలిపివేయాలని తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి నిర్ణయించింది. దీన్ని సీఎం చంద్రబాబు తోసిపుచ్చారు.
 
గతంలో మహా సంప్రోక్షణ జరిగిన సమయంలో ఎటువంటి విధానాలను పాటించారో, ఇప్పుడు కూడా అదే విధానాన్ని పాటించాలని, ఆలయంలోకి భక్తులను అనుమతించాలని ఆదేశించారు. తిరుమల ఆలయంలో దర్శనాల నిలిపివేత అంశంపై విమర్శలు వస్తున్న వేళ, ఈ ఉదయం అధికారులతో పరిస్థితిని సమీక్షించిన ఆయన, పరిమిత సంఖ్యలో అయినా సరే భక్తులకు స్వామి దర్శనం చేయించాలని సూచించారు. 
 
అదేసమయంలో ఆగమ శాస్త్రం ప్రకారం జరిగే మహా సంప్రోక్షణ క్రతువుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా దర్శనాలకు ఏర్పాట్లు చేయాలని తితిదే అధికారులను కోరారు. గతంలో 1994, 2006 సంవత్సరాల్లో ఇదే క్రతువు జరిగినప్పుడు పాటించిన నిబంధనలనే ఇప్పుడూ పాటించాలని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. 
 
కాగా, ఇటీవల తితిదే ఛైర్మన్ సుధాకర్ యాదవ్ సారథ్యంలో సమావేశమైన పాలక మండలి, ఈవీ అనిల్ కుమార్ సింఘాల్‌లు ఐదు రోజుల పాటు శ్రీవారి దర్శనాన్ని భక్తులకు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. ఇది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో కల్పించుకున్న చంద్రబాబు.. దర్శనానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments