Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎపుడైనా మరో సర్జికల్ స్ట్రైక్ చేస్తాం : పాకిస్థాన్‌కు ఆర్మీ చీఫ్

పాకిస్థాన్‌కు భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ మరోమారు హెచ్చరిక చేశారు. పాకిస్థాన్ సైన్యంతో పాటు నిఘా సంస్థ ఐఎస్ఐను అదుపులో ఉంచుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే మరోమారు సర్జికల్ స్ట్రైక్

Webdunia
సోమవారం, 24 సెప్టెంబరు 2018 (16:47 IST)
పాకిస్థాన్‌కు భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ మరోమారు హెచ్చరిక చేశారు. పాకిస్థాన్ సైన్యంతో పాటు నిఘా సంస్థ ఐఎస్ఐను అదుపులో ఉంచుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే మరోమారు సర్జికల్ స్ట్రైక్‌కు వెనుకాడబోమని వార్నింగ్ ఇచ్చారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, సరిహద్దుల్లో భారత సైనికులతో పోరాడలేక అన్యాయంగా పోలీస్ ఆఫీసర్లను ఎత్తుకెళ్తూ వారిని దారుణంగా చంపుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. సైన్యాన్ని, ఐఎస్‌ఐను ఇప్పటికైనా పాక్ ప్రభుత్వం అదుపులో పెట్టుకోవాలని లేకపోతే మరోసారి సర్జికల్ స్ట్రైక్ తప్పవని ఆయన హెచ్చరించారు. 
 
అయితే గత గురువారం ఇద్దరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు, ఒక కానిస్టేబుల్‌ను అపహరించిన పాక్ ఉగ్రవాదులు వారిని దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. అంతకుముందు సరిహద్దుల్లో కూడా ఓ జవాన్‌ను ఉగ్రమూక చంపింది. దీంతో న్యూయార్క్‌లో పాకిస్థాన్ ఆర్థిక మంత్రి షా మెహమూద్ ఖురేషి, భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మధ్య జరగాల్సిన సమావేశాన్ని భారత్ రద్దు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments