Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెక్కు చెదరని విక్రమ్ ల్యాండర్ .. సంబంధాల పునరుద్ధరణకు యత్నాలు...

Webdunia
బుధవారం, 11 సెప్టెంబరు 2019 (09:49 IST)
చంద్రుడు దక్షిణ ధృవం అన్వేషణ నిమిత్తం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రయాన్-2 మిషన్‌లో జాబిల్లిపైకి పంపిన విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా ఉందట. ఇది హార్డ్ ల్యాండింగ్ సమయంలో పక్కకు ఒరిగిపోయిందేగానీ, చెక్కుచెదరలేదని ఇస్రో శాస్త్రవేత్తలు అంటున్నారు. ఏదిఏమైనా విక్రమ్‌తో సంబంధాల పునరుద్ధరణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్టు ఇస్రో ప్రకటించింది. 
 
విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగే సమయంలో కమ్యూనికేషన్‌ కోల్పోయింది. ఇపుడు ఇది ఎక్కడుందో గుర్తించడం జరిగింది. అయితే అది ల్యాండ్ కావాల్సిన ప్రాంతానికి 500 మీటర్ల దూరంలో పక్కకు ఒరిగి ఉందని ఇస్రో తెలిపింది. అదేసమయంలో విక్రమ్ ఏమాత్రం చెక్కుచెదరలేదని, దాంతో సంబంధాలు పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నామని ప్రకటన వెలువరించింది.
 
చంద్రయాన్‌-2 ప్రాజెక్టులో భాగంగా, 7న చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ కావాల్సిన విక్రమ్ చివరి క్షణాల్లో చంద్రుని ఉపరితలంపై హార్డ్‌ ల్యాండింగ్‌ అయిన విషయం తెలిసిందే. విక్రమ్‌ను చంద్రుని వద్దకు తీసుకు వెళ్లిన ఆర్బిటర్‌ సాయంతో జాడ కనుగొన్నామని ఆదివారం నాడు ప్రకటించిన ఇస్రో, దాన్ని మరోసారి ధ్రువీకరించింది.
 
ఆన్‌‌బోర్డ్‌ కెమెరాల సాయంతో విక్రమ్‌ ల్యాండర్‌‌ను గుర్తించామని, ఇదేసమయంలో దానితో ఎటువంటి కమ్యూనికేషన్‌ జరగడం లేదని తెలిపింది. సంబంధాలు పునరుద్ధరించేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments