Webdunia - Bharat's app for daily news and videos

Install App

750 కేజీల ఉల్లి ధర రూ.1064... ప్రధాని మోడీకి ఎంవో చేసిన రైతు

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (14:09 IST)
మహారాష్ట్ర నాసిక్ జిల్లాకు చెందిన ఓ ఉల్లిరైతు వినూత్నంగా నిరసన తెలిపాడు. నాలుగు నెలల పాటు కష్టపడి పండించిన ఉల్లికి తగిన గిట్టుబాటు ధర లేదని ఆగ్రహించిన రైతు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విపత్తు నిర్వహణ శాఖకు పంటను విక్రయించగా వచ్చిన డబ్బును విరాళంగా పంపించి తన నిరసనను తెలిపాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
నాసిక్‌ జిల్లాలోని నిప్‌హాద్‌ వాసి సంజయ్‌ సాఠె అనే రైతు నాలుగు నెలలు శ్రమించి 750 కిలోల ఉల్లి పండించాడు. కిలోకు ఒక రూపాయి మాత్రమే లభించడంతో ఆగ్రహించాడు. చివరకు పలు రకాలుగా బేరమాడి కిలోకు రూ.1.40కు విక్రయించారు. తద్వారా వచ్చిన రూ.1,064ను ప్రధాని మోడీకి విరాళం పంపించాడు. 
 
నిజానికి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా 2010లో భారత సందర్శనకు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం 'గతిశీల రైతుల'ను గుర్తించింది. వారిని ఒబామాతో మాట్లాడించింది. అందులో సంజయ్‌ ఒకరు కావడం గమనార్హం. 
 
దీనిపై సంజయ్ మాట్లాడుతూ, నాలుగు నెలలు కష్టపడి 750 కిలోల ఉల్లి పండించా. నిప్‌హద్‌ టోకు మార్కెట్లో కిలోకు ఒక రూపాయి మాత్రమే ఇస్తానన్నారు. బేరమాడి దానిని రూ.1.40కు పెంచాను. మొత్తంగా రూ.1,064 అందుకున్నాను. నా కష్టానికి తగిన ప్రతిఫలం చూసి బాధేసింది. అందుకే నిరసనగా ప్రధాని విపత్తు నిర్వహణ శాఖకు ఆ మొత్తం పంపించాను. మనియార్డర్‌ చేసేందుకు అదనంగా రూ.54 ఖర్చుచేశాను. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. మా కష్టాలపై సానుభూతి లేని ప్రభుత్వంపై కోపంతో ఇలా చేశా’ అని వెల్లడించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments