Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముహూర్త టైమ్‌కు వరుడు పరార్ : 21 యేళ్ళ వధువును పెళ్లాడిన 65 యేళ్ళ మామ

బీహార్ రాష్ట్రంలో మరో వింత సంఘటన ఒకటి జరిగింది. పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన వరుడు ముహూర్త సమయానికి అదృశ్యమయ్యాడు. దీంతో ఆ వధువును 65 యేళ్ళ వయసున్న వరుడు తండ్రి (మామ) పెళ్లి చేసుకున్నాడు.

Webdunia
మంగళవారం, 9 అక్టోబరు 2018 (18:48 IST)
బీహార్ రాష్ట్రంలో మరో వింత సంఘటన ఒకటి జరిగింది. పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన వరుడు ముహూర్త సమయానికి అదృశ్యమయ్యాడు. దీంతో ఆ వధువును 65 యేళ్ళ వయసున్న వరుడు తండ్రి (మామ) పెళ్లి చేసుకున్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా సమీపంలోని సమష్టిపూర్‌కు చెందిన రోషన్ లాల్ (65) అనే వ్యక్తి కుమారుడుకి అదే ప్రాంతానికి చెందిన స్వప్న (21) అనే యువతినిచ్చి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు.
 
వీరిద్దరి పెళ్లి ఆదివారం జరగాల్సి వుంది. ఇందుకోసం అన్ని రకాల ఏర్పాట్లూ కూడా చేశారు. పెళ్లి మండపానికి బంధువులతో పాటు వధూవరులు కూడా వచ్చారు. 
 
అయితే, ముహూర్త సమయానికి వరుడు కనిపించకుండా పోయాడు. దీంతో పీటలపై పెళ్లి ఆగిపోయింది. ఈ పెళ్లి ఆగిపోతే తమ పరువు పోతుందని భావించిన వధువు తండ్రి.. తన కుమార్తెను వివాహం చేసుకోవాలని వరుడు తండ్రిని ప్రాధేయపడ్డాడు. 
 
దీంతో 65 యేళ్ల రోషన్ లాల్ వధువు జీవితం పాటు వియ్యంకుడు కుటుంబ గౌరవ ప్రతిష్టలను కాపాడేందుకు 21 యేళ్ళ వధువును పెళ్లి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments