Webdunia - Bharat's app for daily news and videos

Install App

#JuhiChawlaకు రూ. 20లక్షల జరిమానా.. 5జీ నెట్‌వర్క్‌పై టైమ్ వేస్ట్... అంతా పబ్లిసిటీ కోసమే!

Webdunia
శుక్రవారం, 4 జూన్ 2021 (19:49 IST)
Juhi Chawla
బాలీవుడ్ నటి జూహీ చావ్లాకు ఢిల్లీ హైకోర్టుకు చుక్కెదురైంది. దేశంలో 5జీ నెట్‏వర్క్ ట్రయల్స్ వద్దంటూ జూహీ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో శుక్రవారం ఈ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. ఇంకా ఆమె పిటిషన్‌ను తోసిపుచ్చింది. 
 
దేశంలో టెక్నాలజీ అప్ గ్రేడ్ కావాలని స్పష్టం చేసింది. అంతటితో ఆగకుండా అలాగే కోర్టు సమయాన్ని వృధా చేశారంటూ.. నటికి రూ. 20లక్షల జరిమానా విధించింది ఢిల్లీ హైకోర్టు. అంతేకాకుండా.. కోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో ఆమె అభిమాని పాటలు పాడడం.. అందుకు సంబంధించిన వీడియోను నటి సోషల్ మీడియాలో షేర్ చేయడం పై ఆమె పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
 
ఈ విషయం గురించి కోర్టును ఆశ్రయించేకంటే ముందు ప్రభుత్వానికి లేఖ రాయాల్సిందని అభిప్రాయపడింది. ఈ పిటిషన్‌లో సరైన సమాచారం లేదని.. కేవలం పబ్లిసిటి కోసమే పిటిషన్ ధాఖలు చేశారని సీరియస్ అయ్యింది. 
 
ఇదిలా ఉంటే.. దేశంలో 5జీ టెక్నాలజీ వలన తీవ్రమైన ప్రమాదాలు జరుగుతాయని.. ఈ టెక్నాలజీ వలన ఎలాంటి ప్రమాదం లేదని.. ప్రభుత్వం నుంచి ధ్రువీకరణ లేఖ వచ్చేవరకు 5జీ నెట్ వర్క్ ట్రయల్ ఆపాలని కోరుతూ.. జూహీ చావ్లా సహా మరో ఇద్దరు పిటిషనర్లు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. 
 
దాదాపు 5 వేల పేజీల ఈ పిటిషన్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లాంటి ఏజెన్సీలతో పాటు యూనివర్సిటీలు, ప్రపంచ ఆరోగ్య సంస్థను పక్షాలుగా చేర్చారు. అయితే జూహీ ఈ పని చేసిందని.. అలాగే కోర్టు సమయాన్ని కూడా వృధా చేసిందని.. ఆమె పిటిషన్‏ను కోర్టు కొట్టివేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments