Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీతాలు లేని యూఎస్ సీక్రెట్ ఏజెంట్లు.. పిజ్జాలు తెచ్చిచ్చిన జార్జి బుష్

Webdunia
శనివారం, 19 జనవరి 2019 (12:30 IST)
అమెరికాలో ఆర్థిక షట్‌డౌన్ కొనసాగుతోంది. మెక్సికో గోడ నిర్మాణానికి అవసరమైన నిధులను సమకూర్చేందుకు సెనెట్ నిరాకరించింది. దీంతో ఆదేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భీష్మించికూర్చొన్నారు. ఫలితంగా గ‌త 27 రోజులుగా అమెరికా ప్ర‌భుత్వం తాత్కాలికంగా మూత‌ప‌డింది. ద్ర‌వ్య బిల్లుకు అనుమ‌తి ద‌క్క‌క‌పోవ‌డం వ‌ల్ల సుమారు 8 ల‌క్ష‌ల మంది జీతాలు లేకుండా ప‌నిచేస్తున్నారు. అందులో ఆరు ల‌క్ష‌ల మంది సీక్రెట్ స‌ర్వీస్ ఉద్యోగులు ఉన్నారు.
 
ఈ పరిస్థితుల్లో ఆ దేశ మాజీ అధ్యక్షుడు జార్జిబుష్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. జీతాలు లేకుండా ప‌నిచేస్తున్న సీక్రెట్ స‌ర్వీస్ ఏజెంట్ల‌కు ఆయ‌న పిజ్జాలు తెచ్చి ఇచ్చారు. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్ల‌డించారు. మొత్తం ఆరు మంది సీక్రెట్ ఏజెంట్లు ప్ర‌స్తుతం బుష్ వ‌ద్ద ప‌నిచేస్తున్నారు. వారంద‌రికీ ఆయ‌న పిజ్జాలు తెచ్చి ఇచ్చారు. తాను, త‌న భార్య లారా కూడా ఏజెంట్ల‌కు రుణ‌ప‌డి ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. 
 
మరోవైపు మెక్సికో బోర్డర్ గోడకు నిధులు కేటాయిస్తేనే ద్రవ్య బిల్లుకు ఓకే చెబుతామని డోనాల్డ్ ట్రంప్ మొండికేశారు. దీనిపై ఆయన జార్జి బుష్ వీలైనంత త్వరగా సమస్యకు పరిష్కారం కనుగొనాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments