Webdunia - Bharat's app for daily news and videos

Install App

#GobackAmitShah : నీలాంటి టెర్రరిస్టును రానివ్వదు... తమిళ నెటిజన్ల షాక్

కమలనాథులకు తమిళ నెటిజన్లు తేరుకోలేని షాకిచ్చారు. గో బ్యాక్ అమిత్ షా అంటూ నినందించారు. ఇటీవల ఒక్కరోజు పర్యటన కోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెన్నై నగరానికి వచ్చారు. దీంతో ఆయనపై నెటిజన్లు 'గో బ్య

Webdunia
బుధవారం, 11 జులై 2018 (08:38 IST)
కమలనాథులకు తమిళ నెటిజన్లు తేరుకోలేని షాకిచ్చారు. గో బ్యాక్ అమిత్ షా అంటూ నినందించారు. ఇటీవల ఒక్కరోజు పర్యటన కోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెన్నై నగరానికి వచ్చారు. దీంతో ఆయనపై నెటిజన్లు 'గో బ్యాక్‌ అమిత్‌ షా' ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు.
 
ఆయన రాకతో రాష్ట్ర బీజేపీలో జోష్‌ కనిపిస్తున్నా తమిళ యువత నుంచి సామాజిక మాధ్యమాల్లో తీవ్ర నిరసన వెల్లువెత్తడంతో ఆ పార్టీ వర్గాలు ఖంగుతిన్నాయి. నెటిజన్లలో అత్యధికులు షా రాకను ముక్తకంఠంతో వ్యతిరేకించారు. 'గో బ్యాక్‌ అమిత్‌ షా' అనే హ్యాష్‌ట్యాగ్‌తో కామెంట్లు వెల్లువెత్తాయి.
 
గో బ్యాక్ అమిత్ షా అనే నినాదం ట్వీట్లు, రీట్వీట్లతో విపరీతంగా ట్రెండింగ్‌ అయింది. దీనికి ఏకంగా 1,29,000 మంది మద్దతు ప్రకటించారు. ఫలితంగా ట్విటర్‌ ఇండియా ట్రెండ్స్‌లో ఇది టాప్‌-2లో నిలవడం గమనార్హం. 
 
అంతేనా..."సమానత్వానికి తమిళ గడ్డ వేదిక.. నీలాంటి టెర్రరిస్టును రానివ్వదు", "తమిళనాడు ఇండియా కాదు అమిత్‌ షా..! ప్రజాస్వామ్య గ్యాంబ్లర్‌ను మేము అంగీకరించం", "ట్యూటికోరిన్‌ కాల్పులపై అమిత్‌ షా స్పందించారా? ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఆయనకు నైతిక బాధ్యత లేదా?", "నోట్ల రద్దు స్కామ్‌ స్టార్‌ గో బ్యాక్‌" అంటూ పలు విధాలుగా వ్యాఖ్యలు చేశారు. మొత్తంమీద గోబ్యాక్‌ అమిత్‌ షా ప్రచారం బీజేపీకి చెందిన రాష్ట్ర నేతలకు ఏమాత్రం మింగుడు పడకపోగా... విపక్ష నేతలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments