Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనవరిలో ఎన్నికలా..? జగన్‌కు ఎలా తెలుసు? కుర్చీకాంక్ష అంటూ బాంబు పేల్చిన శివాజీ

సినీ నటుడు శివాజీ మరో బాంబు పేల్చాడు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఇరుకున పెట్టేందుకు రాజ్యాంగబద్ధమైన సంస్థ సంస్థ (కోర్టు) నుంచి నోటీసులు వస్తాయని ఇటీవల ప్రకటించారు. ఆయన మాటలను రుజువు చేసేల

Webdunia
శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (16:46 IST)
సినీ నటుడు శివాజీ మరో బాంబు పేల్చాడు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఇరుకున పెట్టేందుకు రాజ్యాంగబద్ధమైన సంస్థ సంస్థ (కోర్టు) నుంచి నోటీసులు వస్తాయని ఇటీవల ప్రకటించారు. ఆయన మాటలను రుజువు చేసేలా బాబ్లీ కేసులో మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నుంచి చంద్రబాబుకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీకానుంది.
 
ఈ నేపథ్యంలో శివాజీ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, మరో బాంబు పేల్చాడు. చంద్రబాబుకు మరో రెండుమూడు నోటీసులు రాబోతున్నట్లు చెప్పారు. చంద్రబాబు వారి ట్రాప్‌లో పడొద్దని శివాజీ హితవు పలికారు. త్వరలో రెండో నోటీసులు రాబోతున్నాయని కూడా చెప్పుకొచ్చారు.
 
ఇకపోతే, తనకు పనీపాటా లేకుండా తిరుగుతున్నాడని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై శివాజీ స్పదించారు. జగన్‌కు ఏమన్నా పని ఉందా? అని మండిపడ్డారు. ఆయనేమన్నా మహాత్ముడా? అని నిలదీశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోయడం సరికాదని వ్యాఖ్యానించారు. 
 
ముఖ్యంగా రాష్ట్రంలో కుర్చీ కాంక్ష మొదలైనప్పుడే విధ్వంసం మొదలవుతుందని శివాజీ హెచ్చరించారు. జనవరిలో ఎన్నికలు వస్తాయని జగన్ ఎలా చెప్పగలుగుతున్నారని శివాజీ ప్రశ్నించారు. ఏదోవిధంగా చంద్రబాబును ఒంటరి చేసి, ప్రభుత్వాన్ని కూలదోయాలని చూస్తున్నారని ఆరోపించారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీకి ఎదురొడ్డి నిలబడిన నేత చంద్రబాబు ఒక్కరేనని శివాజీ గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments