వేడి వేడి ఇడ్లీలు కావాలా? ఐతే ఇడ్లీ ఏటీఎం వచ్చేసిందిగా! చట్నీతో పాటు..?

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2022 (21:20 IST)
Idly
వేడి వేడి ఇడ్లీలు కావాలా? అయితే అక్కడ ఏటీఎం మెషిన్ వద్దకు వెళ్లవచ్చు. ఇదేంటి అనుకుంటున్నారా.. ఐతే చదవండి మరి.. భారత ఐటీ రాజధాని బెంగళూరులో స్కాన్ చేయగానే వేడి వేడి ఇడ్లీలు వచ్చే ఏటీఎం ఏర్పాటైంది.  అవును బెంగళూరులో ఆకలి తీర్చే ఇడ్లీ ఏటీఎం వచ్చేసింది. 
 
వివరాల్లోకి వెళితే.. బెంగళూరులో ఏర్పాటైన ఇడ్లీ ఏటీఎం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ ప్రత్యేకమైన యంత్రం వీడియో ఇప్పుడు ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. బి పద్మనాభన్ అనే వ్యక్తి షేర్ చేసిన వీడియోలో ఇడ్లీ ఏటీఎం ఎలా పని చేస్తుందో ఓ మహిళ వివరిస్తుంది. 
 
ఫ్రెషాట్ పేరిట ఏర్పాటు చేసిన ఈ ఇడ్లీ ఏటీఎం ఔట్ లెట్‌ను చూపించడంతో ఈ వీడియో ప్రారంభం అవుతుంది. లోపలికి వెళ్లిన తర్వాత క్యూఆర్ కోడ్‌తో ఆర్డర్‌ ఎలా చేయాలో వివరిస్తుంది. 
 
కేవలం 50 సెకన్లలో ఇడ్లీ తయారవుతుందని, ఆకర్షణీయంగా చేసిన డబ్బాలో పార్సిల్ బయటికి వస్తుందని ఆమె చెప్పింది. రుచి కూడా బాగుందని సదరు మహిళ తెలిపింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్న మూవీ పరిశ్రమలో నిలిచిపోతుంది : హీరో కార్తిక్ శివన్

Lavanya: లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి రిలీజ్‌ కు సిద్ధం

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కుమార్తెకు వేధింపులు.. ఒకరి అరెస్టు

Rajanikanth: రజినీకాంత్ భాషా చిత్రం చిరంజీవి ఎలా మిస్ అయ్యారో తెలుసా !

Pawan Kalyan: జానీ కి ముందే పవన్ కళ్యాణ్ ఆరోగ్యం దెబ్బతింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మలేరియా దినోత్సవం- గర్భధారణ సమయంలో మలేరియా.. గుర్తించకపోతే...?

వేసవిలో కొబ్బరి నీరు ఆరోగ్య ప్రయోజనాలు

పార్కిన్సన్స్ రోగుల కోసం మెడ్‌ట్రానిక్ అడాప్టివ్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సిస్టమ్‌

heat stroke వడదెబ్బ తగ్గేందుకు చిట్కాలు

ఎముక పుష్టి కోసం క్యాల్షియం వున్న ఆహార పదార్థాలు ఇవే

తర్వాతి కథనం
Show comments