Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి దంపతులకు మళ్లీ బాబు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో

యంగ్ టైగర్ ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి దంపతులకు రెండో కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపాడు. తన భార్య మరోసారి మగబిడ్డకు జన్మనిచ్చిందని, తన కుటుంబం మరిం

Webdunia
సోమవారం, 18 జూన్ 2018 (10:27 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి దంపతులకు రెండో కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపాడు. తన భార్య మరోసారి మగబిడ్డకు జన్మనిచ్చిందని, తన కుటుంబం మరింత పెద్దదయిందని చెప్పాడు. 
 
2011లో ఎన్టీఆర్ దంపతులకు తొలి కుమారుడు జన్మించాడు. అతని పేరు అభయ్. ప్రస్తుతం రెండో కుమారుడు పుట్టడంతో ఎన్టీఆర్ బంధుమిత్రులు, అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఇక గత వారంలో జన్మించిన తన రెండో కుమారుడిని ఎన్టీఆర్ తొలిసారిగా అభిమానులకు పరిచయం చేశాడు. 
 
సోషల్ మీడియా ఫొటో షేరింగ్ ప్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్‌లో ఇటీవల ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్, దానిలో తొలి పోస్టుగా ఉంచిన ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. పెద్ద కుమారుడు అభయ్ రామ్ తన చేతుల్లో తమ్ముడిని ఎత్తుకుని ఓ కుర్చీలో కూర్చుని ఉండగా, ఎన్టీఆర్ తన స్మార్ట్ ఫోన్‌లో దాన్ని చిత్రీకరిస్తున్నట్టు వున్న ఫోటోను రిలీజ్ చేశారు. ఈ ఫోటోను మీరూ ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రదీప్ రావత్ అంత్యక్రియలకు హాజరైన అమీర్ ఖాన్, అశుతోష్ గోవారికర్

మగవాడికి కమిట్‌మెంట్ ఇవ్వనిదే సినిమా ఛాన్సే కాదు సీరియల్ ఛాన్స్ కూడా రాదు, యువతి వీడియో వైరల్

Genelia Deshmukh: అభిమానుల ప్రేమతో 39వ పుట్టినరోజు జరుపుకున్న జెనీలియా దేశ్‌ముఖ్

Jayam Ravi: భార్యతో విడాకులు.. వడ్డీ కాసుల వాడిగా జయం రవి

Anand Deverakonda :బీచ్ పోస్టర్‌తో ఆనంద్ దేవరకొండ... ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments