Webdunia - Bharat's app for daily news and videos

Install App

కత్తి మహేష్‌కు తిక్కకుదిరింది.. నగరంలో అడుగుపెడితే మూడేళ్లు జైలే

సినీ విమర్శకుడు కత్తి మహేష్ తిక్కకుదిరింది. కోట్లాది మంది హిందువుల మనోభావాలు కించపరిచేలా శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ

Webdunia
సోమవారం, 9 జులై 2018 (14:44 IST)
సినీ విమర్శకుడు కత్తి మహేష్ తిక్కకుదిరింది. కోట్లాది మంది హిందువుల మనోభావాలు కించపరిచేలా శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో కత్తి మహేష్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా స్వామి పరిపూర్ణానంద స్వామి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. దీన్ని పోలీసులు అడ్డుకుని, ఆయన్ను గృహనిర్బంధం చేశారు.
 
అదేసమయంలో కత్తి మహేష్‌పై నగర బహిష్కరణ వేటువేశారు. ఆర్నెల్లపాటు నగరంలో అడుగుపెడితే మూడేళ్ళ జైలుశిక్ష తప్పదని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. భావవ్యక్తీకరణ ప్రాథమిక హక్కే అయినప్పటికీ... ఇష్టానుసారం మాట్లాడుతూ, సమాజంలో ఉద్రిక్తతలకు కారణమయ్యేవారిని ఉపేక్షించబోమని, కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 
ఎవరైనా సరే ఎదుటి వ్యక్తుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడితే, చర్యలు తీసుకుంటామన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న సినీ క్రిటిక్ కత్తి మహేష్‌ను ఆర్నెల్ల పాటు హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నుంచి ఆయనను తీసుకెళ్లి, ఆయన స్వస్థలమైన చిత్తూరు జిల్లాలో విడిచి పెట్టేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఈ ఆరు నెలల్లో కత్తి మహేష్ హైదరాబాదులో అడుగుపెట్టేందుకు యత్నిస్తే... అది నేరమవుతుందని, అదే జరిగితే మూడేళ్ల జైలు శిక్షకు ఆయన అర్హులవుతారని డీజీపీ వివరించారు. 
 
ఏ రాష్ట్రానికి చెందినవారైనా హైదరాబాదులో ప్రశాతంగా బతకొచ్చని... కానీ, సమాజంలో ఉద్రిక్తతలకు కారణమయ్యేలా ఎవరు ప్రవర్తించినా ఊరుకోబోమన్నారు. ఇలాంటి వ్యక్తులకు సహకరించే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి వార్తలకు ఎక్కువ ప్రచారం కల్పించరాదని మీడియాను కోరుతున్నామని తెలిపారు.
 
గత నాలుగేళ్లుగా తెలంగాణలో శాంతిభద్రతలు బాగున్నాయని... ఇకపై కూడా రాష్ట్రం శాంతియుతంగానే ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నవారు అవుతారన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా... రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని డీజీపీ మహేందర్ రెడ్డి కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments