Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచుకొండపై లవ్ ప్రపోజల్.. 650 అడుగుల ఎత్తు నుంచి ప్రేయసి కిందపడిపోవడంతో..?

Webdunia
శనివారం, 2 జనవరి 2021 (14:55 IST)
Hills
ప్రస్తుతం లవ్ ప్రోపజల్ చేయడంలో సర్ ప్రైజ్ వుండటం ఫ్యాషనైపోయింది. అద్భుతమైన ప్రదేశాల్లో లవ్ ప్రపోజల్ చేయడం ట్రెండ్ అవుతోంది. తాజాగా అలాంటి ఓ లవ్ ప్రపోజల్ ప్రాణాల మీదకు తెచ్చింది. వివరాల్లోకి వెళితే.. ప్రియుడు చేసిన ప్రేమ ప్రతిపాదనకు ఒక మహిళ అంగీకారం తెలిపింది.

అంతలోనే కొండ అంచు నుంచి జారి కిందకు పడింది. అయితే ఆమె పడిన ప్రాంతంలో భారీగా మంచు ఉండటంతో ప్రాణాలతో బయటపడింది. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన ప్రియుడు కూడా కొండ అంచుకు చిక్కుకుని వేలాడగా రెస్క్యూ సిబ్బంది కాపాడారు. ఆస్ట్రియాలోని కారింథియాలో ఈ ఘటన జరిగింది.
 
32 ఏళ్ల మహిళ, 27 ఏళ్ల వ్యక్తి ప్రేమలో ఉన్నారు. డిసెంబర్‌ 26న వారిద్దరు ఫాల్కర్ట్ పర్వతాన్ని అధిరోహించారు. ఆ మరునాడు ఇద్దరు శిఖరానికి చేరుకున్నారు. అక్కడ ఆ వ్యక్తి ఆమెకు తన ప్రేమను వ్యక్తం చేశాడు. దానికి ఆమె అంగీకరం తెలిపారు.

అంతలోనే ఆ మహిళ కొండ అంచు నుంచి జారి 650 అడుగుల ఎత్తు నుంచి కింద పడింది. మంచుపై పడి కదలలేని స్థితిలో ఉన్న ఆమెను గమనించిన కొందరు రెస్క్యూ అధికారులకు సమాచారం అందించారు.
 
మరోవైపు పడిపోతున్న ప్రియురాలిని కాపాడేందుకు ప్రయత్నించిన ప్రియుడు కూడా కొండ అంచున చిక్కుకుని గాల్లో వేలాడాడు. హెలికాప్టర్‌లో వచ్చిన రెస్క్యూ సిబ్బంది వారిద్దరిని కాపాడి ఆసుపత్రికి తరలించారు.

మంచు వల్ల ప్రాణాలతో బయటపడ్డ ఆ ప్రేమికులు అదృష్టవంతులని పోలీసు అధికారి తెలిపారు. శీతాకాలం కాకపోయి ఉండే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments