Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడితో భూమా అఖిలప్రియ నిశ్చితార్థం

ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ పెళ్లికూతురు కానున్నారు. ఇప్పటికే అఖిల ప్రియ ఇంట పెళ్లి వేడుక మొదలైంది. మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు భార్గవ్‌తో మంత్రి అఖిలప్రియకు నిశ్చితార్థం జరిగింది. హైదర

Webdunia
శనివారం, 12 మే 2018 (13:15 IST)
ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ పెళ్లికూతురు కానున్నారు. ఇప్పటికే అఖిల ప్రియ ఇంట పెళ్లి వేడుక మొదలైంది. మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు భార్గవ్‌తో మంత్రి అఖిలప్రియకు నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్‌లోని మంత్రి అఖిల ప్రియ నివాసంలో ఈ శుభకార్యం జరిగింది. ఈ కార్యక్రమంలో సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. 
 
ఇక భార్గవ్.. మాజీ డీజీపీ సాంబశివరావు చిన్న కూతురి భర్త. అఖిల ప్రియను రెండోసారి ఆయన మనువాడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నిశ్చితార్థ వేడుక గురించి మంత్రి అఖిలప్రియ కుటుంబం కానీ, భార్గవ్ కుటుంబం కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక దివంగత ముఖ్యమంత్రి వైస్సార్ బావమరిది, కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడితో గతంలో అఖిల ప్రియకు వివాహమైన సంగతి తెలిసిందే. 
 
కానీ ఏడాదికే విభేదాలతో అఖిల ప్రియ విడాకులు తీసుకుంది. ఆ తర్వాత భార్గవ్‌తో ఆమె ఐదేళ్ల పాటు ప్రేమాయణం సాగించిందని.. ఈ ప్రేమ కారణంగా భార్గవ్ సాంబశివరావు కుమార్తెకు విడాకులిచ్చినట్లు తెలిసింది. దీంతో వీరిద్దరి వివాహం త్వరలో జరుగనుందని భూమా అఖిల ప్రియ సన్నిహితుల సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments