Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సేమ్ సీన్' రిపీట్... లోక్‌సభ 37 సెకన్లకే... రాజ్యసభ రేపటికి వాయిదా

పార్లమెంట్ ఉభయ సభలు మరోమారువాయిదా పడ్డాయి. ప్రధాని మోడీ ప్రభుత్వంపై తెలుగుదేశం, వైకాపా పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చించాలంటూ ఆ రెండు పార్టీలకు చెందిన ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. కాన

Webdunia
బుధవారం, 21 మార్చి 2018 (11:33 IST)
పార్లమెంట్ ఉభయ సభలు మరోమారువాయిదా పడ్డాయి. ప్రధాని మోడీ ప్రభుత్వంపై తెలుగుదేశం, వైకాపా పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చించాలంటూ ఆ రెండు పార్టీలకు చెందిన ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. కానీ, ఉభయ సభల్లో ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. 
 
దీనికి కారణంలేకపోలేదు. కావేరీ జలాల పంపిణీ కోసం కావేరీ బోర్డును ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే, రిజర్వేషన్ల పెంపుపై తెరాస ఎంపీలు ఆందోళనలకు దిగాయి. ఈ రెండు పార్టీలు వెల్‌లోకి దూసుకొచ్చి సభా కార్యక్రమాలను అడ్డుకున్నాయి. దీంతో సభలో రభస చోటుచేసుకుంది. స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎంత వారించినా విపక్షాలు వినకపోవడంతో ఆమె సభ ప్రారంభమైన 37 సెకన్లకే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.
 
మరోవైపు రాజ్యసభలోనూ ఇదే సీను చోటుచేసుకుంది. తమ డిమాండ్ల సాధన కోసం సభలో విపక్ష అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్‌లు అందోళనలు చేపట్టాయి. సభా సజావుగా ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలించలేదంటూ రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సభను ఏకంగా గురువారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. దీంతో తమ తదుపరి కార్యాచరణపై విపక్షాలు దృష్టి సారిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments