Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంతగానో ఎదురుచూసిన ఘడియ వచ్చేసింది : ప్రశాంత్ కిషోర్

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (17:38 IST)
దేశ రాజకీయాల్లో ఎంతగానో ఎదురు చూసిన ఘడియ చివరకు వచ్చేసింది అంటూ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ నేత ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ ఈస్ట్ విభాగానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకా గాంధీని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియమించిన విషయం తెల్సిందే. 
 
దీనిపై ప్రశాంత్ కిషోర్ స్పందించారు. తూర్పు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా ప్రియాంక గాంధీని నియమించడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాజకీయంగా వ్యతిరేక కూటమిలో ఉన్నప్పటికీ... ప్రియాంకకు అభినందనలు తెలిపారు. 'భారత రాజకీయాల్లో ఎంతగానో ఎదురు చూసిన ఘడియ చివరకు వచ్చేసింది. ప్రియాంక రాజకీయాల్లోకి వస్తున్న సమయం, ఆమె చేపట్టనున్న బాధ్యతలు, ఆమె స్థాయిపై ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకునే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఎదిగేందుకు ఆమె నిర్ణయించుకున్నారు. కంగ్రాట్స్ ప్రియాంక గాంధీ' అంటూ వ్యాఖ్యానించారు. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీహార్ సీఎం నితీష్ కుమార్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్‌లకు గతంలో ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పని చేసిన సంగతి తెలిసిందే. ప్రియాంక బాధ్యతలు స్వీకరించనున్న తూర్పు ఉత్తరప్రదేశ్‌లోనే ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి అసెంబ్లీ స్థానం కూడా ఉంది. గతంలో ప్రియాంకతో కలసి ప్రశాంత్ కిషోర్ పని చేశారు. సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో పొత్తు విషయంలో ఇద్దరూ కలిసే వ్యూహాలను రచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాలీవుడ్ స్థాయిలో రాణిస్తున్న భారత డిజైనర్లు...

మంచు విష్ణుకు శ్రీవిష్ణు క్షమాపణలు ఎందుకంటే...

'కింగ్‌డమ్' నుంచి వైల్డ్ పోస్టర్‌ను రిలీజ్ చేసి మేకర్స్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments