PV Sindhu: మా ప్రేమ విమానంలో మొదలైంది..తొలి చూపులోనే పడిపోయాం... పీవీ సింధు

సెల్వి
బుధవారం, 25 డిశెంబరు 2024 (15:29 IST)
PV Sindhu
భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు ఇటీవల పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయిని వివాహం చేసుకున్నారు. ఈ జంట డిసెంబర్ 22న రాత్రి 11:20 గంటలకు రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో అత్యంత సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరైన వేడుకలో వివాహం చేసుకున్నారు. 
 
ఉదయపూర్‌లోని ఉదయ్ సాగర్ సరస్సు ఒడ్డున ఉన్న రాఫెల్స్ హోటల్‌లో వివాహం జరిగింది. వారి వివాహం తర్వాత, మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో, పివి సింధు వెంకట దత్త సాయితో తన ప్రేమకథ గురించి వివరాలను పంచుకున్నారు. సాయి ఫ్యామిలీ ఫ్రెండ్ అయినప్పటికీ, అక్టోబర్ 2022లో విమానంలో వారి ప్రేమ ప్రయాణం ప్రారంభమైందని సింధు వెల్లడించింది.
 
"మేమిద్దరం అక్టోబర్ 2022లో ఒక విమానంలో కలిసి ప్రయాణించాము. ఆ ప్రయాణం తర్వాత, ప్రతిదీ మారిపోయింది. ఆ ప్రయాణం మమ్మల్ని దగ్గర చేసింది. అది 'తొలి చూపులోనే ప్రేమ' అనిపించింది. ఆ క్షణం నుండి, మా ప్రేమకథ ప్రారంభమైంది," అని సింధు తెలిపింది. 
 
సింధు తన నిశ్చితార్థం గురించి కూడా ప్రస్తావించింది, ఇది చాలా తక్కువ మంది హాజరైన భావోద్వేగ క్షణమని.. మా జీవితంలో ఈ ముఖ్యమైన క్షణాన్ని మా సన్నిహితులతో మాత్రమే జరుపుకోవాలని మేము కోరుకున్నాము, అందుకే మేము దానిని గ్రాండ్‌గా కాకుండా సింపుల్‌గా ఉంచాం. ఇది ఒక భావోద్వేగ, మరపురాని క్షణం," అని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" : 'కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్' అంటున్న నేహాశెట్టి

Bigg Boss Telugu 9: జయం సుమన్ శెట్టికి పెరుగుతున్న మద్దతు..

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

Vishnu Vishal: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ టీజర్

శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో శ్రీమురళి చిత్రం పరాక్ ప్రారంభమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments