Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదంతా ఆవుపేడ... నటితో డేటింగ్‌పై రవిశాస్త్రి: ఆవుపేడ అంటే అంత తేలికా అంటూ...

నిమ్రత్ కౌర్‌తో తాను డేటింగ్ చేస్తున్నట్టు వస్తున్న వార్తలపై టీమిండియా కోచ్ రవిశాస్త్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వార్తలన్నీ ఆవుపేడతో సమానమని అన్నారు. తామిద్దరం కేవలం ప్రమోషన్ కోసం కలిశాం తప్పితే అంతకుమించి ఏమీ లేదని స్పష్టం చేశారు. కాగా దీనిపై

Webdunia
మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (12:34 IST)
నిమ్రత్ కౌర్‌తో తాను డేటింగ్ చేస్తున్నట్టు వస్తున్న వార్తలపై టీమిండియా కోచ్ రవిశాస్త్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వార్తలన్నీ ఆవుపేడతో సమానమని అన్నారు. తామిద్దరం కేవలం ప్రమోషన్ కోసం కలిశాం తప్పితే అంతకుమించి ఏమీ లేదని స్పష్టం చేశారు. కాగా దీనిపై ఇప్పటికీ నిమ్రిత్ కూడా ట్వీట్ చేసింది. ఐ లవ్ ఐస్ క్రీమ్ అంటూ దాన్ని తప్ప ఇక దేన్నీ ప్రేమించనని తేల్చేసింది.
 
కాగా లవర్‌బాయ్‌గా గుర్తింపు పొందిన భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. 56 ఏళ్ల వయసులో ఓ కొత్త తోడు దొరికిందని, ఆమె బాలీవుడ్ హీరోయిన్ నిమ్రత్ కౌర్ అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. రవిశాస్త్రి కంటే వయసులో 20 ఏళ్లు చిన్నదైనా.. ఆమెతో రవి డేటింగ్ చేస్తున్నాడని టాక్ వచ్చింది.
 
ఈ మేరకు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్‌కుమార్ నటించిన 'ఎయిర్‌లిఫ్ట్' మూవీతో నిమ్రత్ ఫేమసైంది. ఈ ఇద్దరూ రెండేళ్ల నుంచి సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్నట్లు ముంబై మిర్రర్ పత్రిక వెల్లడించింది. నిజానికి 2015 నుంచి ఈ ఇద్దరిని లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి తమ కొత్త కార్ల లాంచింగ్‌కు పిలుస్తోంది. గత మూడేళ్లుగా ఎన్నో మోడల్స్‌ను రవి, నిమ్రత్ కలిసి లాంచ్ చేశారు. అయితే ఆ కొత్త కార్లు వీళ్ల మనసుల్ని కూడా కలిపాయన్న సంగతి ఇప్పుడే బయటపడింది. 
 
కానీ తాను టీమిండియా కోచ్ రవిశాస్త్రితో సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్నట్టు వచ్చిన వార్తలను బాలీవుడ్ హీరోయిన్ నిమ్రత్ కౌర్ కొట్టిపారేసింది. ఈ వార్తలన్నీ అవాస్తవమని చెప్పింది. ఆడి కార్ల సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో తాము పాల్గొన్నామని, అంతకుమించి ఇద్దరి మధ్య ఏమీ లేదని ట్విట్టర్లో తేల్చి చెప్పేసింది. మీడియాలో వస్తున్న వార్తలు తనను ఎంతో బాధపెట్టాయని నిమ్రత్ కౌర్ స్పష్టం చేసింది. ముందుముందు నిజం అందరికీ తెలుస్తుందని, తనకు మంచి రోజులు వస్తాయని భావిస్తున్నానని తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టింది. కొద్దిసేపటికే రవిశాస్త్రి కూడా ఆవుపేడ అంటూ మండిపడ్డారు. దీన్నీ నెటిజన్లు వదలడంలేదు... ఆవుపేడ అంటే అంతా తేలికా అంటూ సెటైర్లు వేస్తున్నారు మరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments