Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ చున్నీ లాగిన మాజీ సీఎం సిద్ధరామయ్య

Webdunia
సోమవారం, 28 జనవరి 2019 (17:32 IST)
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ఓ మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించారు. మహిళ చేతిలోని మైక్ లాక్కొనే క్రమంలో చున్నీని లాగాడు. ఆమె భుజాన్ని నొక్కి బలవంతంగా కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మైసూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓ సభ జరిగింది. ఇందులో సిద్ధరామయ్య కూడా పాల్గొన్నారు. అక్కడ ఓ మహిళ ముందు వరుసలో నాయకుల ఎదుట నిల్చుని తమ సమస్యల గురించి చెబుతోంది. ఆమె మాటలకు ఆవేశంతో సిద్ధరామయ్య మైక్ లాక్కున్నారు. 
 
మైక్ లాగినప్పుడు దానితోపాటు ఆమె చున్నీ కూడా భుజం పైనుంచి జారింది. ఆ తర్వాత కూడా ఆమె గట్టిగా మాట్లాడుతుండడంతో 'కూర్చోవమ్మా' అంటూ తోయబోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
దీంతో కాంగ్రెస్ నేతలకు మహిళలతో ప్రవర్తించే తీరు తెలియదంటూ బీజేపీ విమర్శలకు దిగింది. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ ఆ మహిళకు క్షమాపణ చెప్పాలని బీజేపీ సీనియర్ నేత ఎస్.ప్రకాశ్ డిమాండ్ చేశారు. అలాగే సిద్ధరామయ్యపై చర్యలు తీసుకోవాలని పార్టీ అధినేత రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments