Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో గుజరాత్ దొంగ : నిన్న నీరవ్... నేడు నితిన్... రూ.5383 కోట్లతో కుచ్చుటోపీ

గుజరాత్ రాష్ట్రానికి చెందిన మరో బడా వ్యాపారి, స్టెర్లింగ్ బయోటెక్ అధినేత నితిన్ సందేశర దేశం విడిచి చెక్కేశాడు. ఈయన దేశీయ బ్యాంకుల నుంచి ఏకంగా రూ.5383 కోట్ల మేరకు రుణాలు తీసుకుని వాటిని చెల్లించకుండా ప

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (10:44 IST)
మరో గుజరాత్ దొంగ దేశం విడిచి పారిపోయాడు. సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ దేశంలోని బ్యాంకుల నుంచి కోట్లాది రూపాయల రుణాలు తీసుకుని వాటిని చెల్లించకుండా విదేశాలకు పారిపోయిన విషయం తెల్సిందే. ఇపుడు అదే గుజరాత్ రాష్ట్రానికి చెందిన మరో బడా వ్యాపారి, స్టెర్లింగ్ బయోటెక్ అధినేత నితిన్ సందేశర దేశం విడిచి చెక్కేశాడు. ఈయన దేశీయ బ్యాంకుల నుంచి ఏకంగా రూ.5383 కోట్ల మేరకు రుణాలు తీసుకుని వాటిని చెల్లించకుండా పారిపోయాడు.
 
ఆంధ్రాబ్యాంకు నేతృత్వంలోని కన్సార్టియం నుంచి రూ.5,383 కోట్ల రుణం తీసుకున్న నితిన్ నైజీరియాకు వెళ్లిపోయాడు. ఇప్పటికే సీబీఐతో పాటు ఈడీ కేసులు ఉన్నప్పటికీ నితిన్ భారత్ నుంచి చల్లగా జారుకోవడంపట్ల సర్వత్ర విస్మయం వ్యక్తమవుతోంది. గుజరాత్‌కు చెందిన స్టెర్లింగ్ బయోటెక్ తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకులు సీబీఐకి ఫిర్యాదు చేశాయి. 
 
ఈ నేపథ్యంలో నితిన్‌తోపాటు కంపెనీలో భాగస్వాములుగా ఉన్న అతని కుటుంబ సభ్యులపై సీబీఐ, ఈడీలు కేసును నమోదుచేశాయి. దీంతో విచారణను తప్పించుకునేందుకు నితిన్ విదేశాలకు పారిపోయినట్లు తెలుస్తోంది. తొలుత నితిన్‌ను దుబాయ్‌లో పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే అది నిజం కాదనీ, ఇప్పటికే నితిన్ కుటుంబం నైజీరియాకు వెళ్లిపోయిందని సీబీఐ అధికారులు తెలిపారు. 
 
బ్యాంకుల నుంచి రూ.5,383 కోట్ల రుణం తీసుకున్న నితిన్ ఈ మొత్తాన్ని 300 డొల్ల కంపెనీల ద్వారా దేశ విదేశాల్లోని అకౌంట్లలోకి అక్రమంగా మళ్లించాడని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన ఈడీ ఇప్పటికే రూ.4,700 కోట్ల విలువైన స్టెర్లింగ్ బయోటెక్ ఆస్తులను జప్తుచేసింది. కాగా, ప్రస్తుతం నైజీరియాలో తలదాచుకున్నారని భావిస్తున్న నితిన్ కుటుంబాన్ని భారత్‌కు రప్పించేందుకు ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులను జారీచేసే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments