Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతిపై రేప్ .. నా భర్తకు నార్కో పరీక్షలు నిర్వహించాలి : బీజేపీ ఎమ్మెల్యే భార్య

యువతిపై అత్యాచారం చేసిన కేసులో తన భర్తతో పాటు.. బాధిత యువతికి కూడా నార్కో పరీక్షలు నిర్వహించాలంటూ అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే భార్య డిమాండ్ చేసింది.

Webdunia
బుధవారం, 11 ఏప్రియల్ 2018 (14:34 IST)
యువతిపై అత్యాచారం చేసిన కేసులో తన భర్తతో పాటు.. బాధిత యువతికి కూడా నార్కో పరీక్షలు నిర్వహించాలంటూ అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే భార్య డిమాండ్ చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార బీజేపీకి చెందిన ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన భార్య సంగీత సెంగార్ బుధవారం యూపీ డీజీపీ ఓపీ సింగ్‌ను కలుసుకున్నారు. ఉన్నావ్‌కి చెందిన అత్యాచార బాధితురాలికి, తన భర్తకు నార్కో పరీక్షలు నిర్వహించాలంటూ వినతిపత్రం సమర్పించారు. అత్యాచారం ఆరోపణల్లో వాస్తవం లేదనీ... తన భర్తకు న్యాయం చేయాలంటూ ఆమె అభ్యర్థించారు. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ, 'నా కుమార్తెలను భయాందోళనకు గురిచేశారు. మమ్ముల్ని మానసికంగా వేధిస్తున్నారు. ఇప్పటికీ ఎలాంటి ఆధారాలు రుజువు కాకుండానే నా భర్త (కుల్దీప్ సెంగార్)పై మీడియా రేపిస్టు అంటూ ముద్ర వేసేసింది' అని ఆమె పేర్కొన్నారు. తన భర్తపై వస్తున్న ఆరోపణలన్నీ 'నిరాధారమైనవనీ', 'కట్టుకథలేనని' కుల్దీప్ భార్య పేర్కొన్నారు. అంతేకాకుండా భర్త తమ్ముడుగానీ, అతడి అనుచరులుగానీ బాధితురాలి తండ్రిపై దాడిచేయలేదనీ... పోలీసులే ఆయనపై దాడిచేశారని ఆమె ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments