Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై 17న జీ తెలుగులో పెళ్లి సందడి

Webdunia
గురువారం, 14 జులై 2022 (19:00 IST)
యూత్‌ఫుల్ లవ్ స్టోరీ పెళ్లి సందడి చిత్రాన్ని టీవీల్లో వీక్షించేందుకు ఎదురుచూస్తున్న ప్రేక్షకులందరికీ ఒక శుభవార్త. వరుస టెలివిజన్ ప్రీమియర్స్‌తో దూసుకెళ్తున్న ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జీ తెలుగు ఇప్పుడు పెళ్లి సందడి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌తో మీ ఎదురుచూపుకి ముగింపు పలకనుంది. గౌరీ రోణంకి దర్శకత్వంలో రోషన్ మరియు శ్రీలీల హీరో హీరోయిన్లుగా, దర్శకేంద్రుడు కే. రాఘవేంద్ర రావు, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, రఘు బాబు ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా జూలై 17న సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది.

 
వివరాల్లోకి వెళితే, రాఘవేంద్ర రావు ప్రముఖ బాస్కెట్ బాల్ క్రీడాకారుడిగా, ద్రోణాచార్య అవార్డుగ్రహీతగా వశిష్ఠ అనే పాత్రలో నటించగా, యుక్తవయస్సులోని వశిష్టగా రోషన్ అదరగొట్టాడు. వశిష్ఠ (రాఘవేంద్ర రావు) తన జీవితకథను వివరిస్తుండటంతో కథ మొదలవుతుంది. వశిష్ఠ విధి కంటే సంకల్పశక్తే గొప్పదని నమ్మితే, సహస్ర (శ్రీలీల) విధే అన్నింటికీ కారణం అని విశ్వసిస్తుంది.

 
ఐతే, వీరిద్దరూ ఒక పెళ్లిలో కలుసుకొని ప్రేమలో పడతారు. కానీ, సహస్ర తండ్రి (ప్రకాష్ రాజ్) వారి ప్రేమను అంగీకరించపోవడంతో కథ మలుపు తిరుగుతుంది. అయితే, వశిష్ట, సహస్రల జంట తనను తిరిగి ఎలా ఒప్పిస్తారన్నదే మూలంగా కథ సాగుతుంది. వశిష్ఠ- సహస్ర మధ్య జరిగే సన్నివేశాలు, రవి బాబు, షకలక శంకర్, వెన్నెల కిషోర్ వంటి హాస్యనటుల అద్భుతమైన ప్రదర్శనలతో ఈ సినిమా ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. ఎం.ఎం కీరవాణి అందించిన సంగీతం అందరిని ఆకట్టుకోగా, కలర్ఫుల్ విజువల్స్‌తో సినిమాటోగ్రఫీ ప్రేక్షకులకు మెప్పించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments