కార్న్ పకోడి తయారీ విధానం

Webdunia
మంగళవారం, 13 ఆగస్టు 2019 (15:44 IST)
పాఠశాలలకు వెళ్లే పిల్లలు సాయంత్రం ఇంటికి వస్తూనే చిరుతిండ్లు కావాలని మారాం చేస్తుంటారు. అలాంటప్పుడు ఈ కార్న్ పకోడి చేసి పెట్టండి. హేపీగా లాగించేస్తారు.

కావలసిన వస్తువులు
బేబీ కార్న్- పది, సెనగపిండి- ముప్పావుకప్పు, పసుపు- పావుటీస్పూన్, కారం- అరటీస్పూన్, ఉప్పు- తగినంత, నూనె- సరిపడా, ఛాట్ మసాలా- కొద్దిగా, అల్లంవెల్లుల్లి పేస్టు- ఒకటీస్పూన్, జీలకర్రపొడి- అరటీస్పూన్, ధనియాల పొడి- ఒకటీస్పూన్.
తయారీ విధానం
ముందుగా బేబీకార్న్ కండెలను మీడియం సైజు ముక్కలుగా కట్ చేయాలి. వాటిని నీళ్లలో కాసేపు ఉడికించాలి. తరువాత నీళ్లు తీసేసి కార్న్ పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలో సెనగపిండి తీసుకొని పసుపు, కారం, ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. మిశ్రమం చిక్కగా ఉండేలా చూసుకోవాలి.
 
ఈ మిశ్రమంలో ఉడికించిన కార్న్ ముక్కలు వేసి బాగా కలియబెట్టాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఈ కార్న్ ముక్కలు వేస్తూ డీప్ ఫ్రై చేయాలి. ఛాట్ మసాలా చల్లుకుని సర్వ్ చేసుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నాన్న, నాన్నమ్మ ప్రవర్తన నచ్చలేదు.. అందుకే చనిపోతున్నా... విద్యార్థిని ఆత్మహత్య

హర్మూజ్‌ జలసంధిని మూసివేసిన ఇరాన్...

రాజ్‌ కుమార్‌పై పోక్సో కేసు : పోలీసులతో రూ.20 లక్షలకు డీల్?

రావణ్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు - మొబైల్ ఫోను, ల్యాప్‌టాప్‌లో ఏముంది?

జూలై 12, 2026 ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో వాతావరణం ఎలా వుంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది: మెగాస్టార్ చిరంజీవి

Pawan Kalyan surgery: పవన్ కళ్యాణ్ కి మూడున్నర గంటలపాటు శస్త్ర చికిత్స

అఖిల్ హిట్టు కొట్టాడు అని అందరూ అంటుంటే ఆనందంగా ఉంది

Ramya Krishna : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లక్ష్మి ప్రణతి పాత్రలో రమ్యకృష్ణ

ఏడుగురు మహిళల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథ తో హ్యాపీ జర్నీ

తర్వాతి కథనం
Show comments