Ganesh Chaturthi 2025: వక్రతుండ మహాకాయ

సిహెచ్
ఆదివారం, 24 ఆగస్టు 2025 (22:28 IST)
4
గణేశుడిని పూజించే ముందు అనేక శ్లోకాలు పఠిస్తారు. వీటిలో ఎక్కువగా పఠించేవి రెండు శ్లోకాలు. వాటిలో మొదటిది...
 
వక్రతుండ మహాకాయ
సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవ
సర్వకార్యేషు సర్వదా
 
భావం: ఓ వంకర తొండం కలవాడా, మహా స్వరూపం కలవాడా, కోటి సూర్యుల తేజస్సు కలవాడా, నా దేవుడా, అన్ని పనులలోను నాకు ఏ ఆటంకాలు లేకుండా చేయి.
 
రెండో శ్లోకం...
శుక్లాంభరధరం విష్ణుం
శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్
సర్వవిఘ్నోపశాంతయే
 
భావం: తెల్లని వస్త్రాలు ధరించినవాడు, వ్యాపకుడైనవాడు, చంద్రుని వంటి వర్ణం కలవాడు, నాలుగు భుజాలు కలవాడు, ప్రసన్నమైన ముఖం కలవాడు అయిన గణపతిని ధ్యానిస్తున్నాను. అన్ని ఆటంకాలు తొలగించమని కోరుకుంటున్నాను.
 
ఈ రెండు శ్లోకాలు సాధారణంగా ఏ పూజ ప్రారంభంలోనైనా, ముఖ్యంగా గణేశుడి పూజ సమయంలో పఠిస్తారు. వీటిని పఠించడం వల్ల పనుల్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉంటాయని నమ్ముతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడితో భార్యను చూసి నడిరోడ్డుపై కాలితో ఎగిరెగిరి తన్నిన భర్త (video)

ప్రియుడిపై కోసం.. ఫ్యామిలీపై పెట్రోల్ పోస్తూ మంటల్లో కాలిపోయిన యువతి...

మట్టిలో మాణిక్యాలకు పద్మశ్రీ పురస్కారాలు

ఎవరికీ తలవంచం... దేనికీ రాజీపడే ప్రసక్తే లేదు : విజయ్

బంకర్‌లోకి వెళ్లి దాక్కున్న ఇరానీ అధినేత ఖమేనీ

అన్నీ చూడండి

లేటెస్ట్

23-01-2026 శుక్రవారం ఫలితాలు - ర్చులు విపరీతం.. అవసరాలు వాయిదా వేసుకుంటారు...

వసంత పంచమి, అక్షరాభ్యాసం చేయిస్తే...

మేడారం జాతర: త్వరలోనే హెలికాప్టర్ సేవలు.. కోటిన్నరకు పైగా భక్తులు

22-01-2025 గురువారం ఫలితాలు - మాటతీరు అదుపులో ఉంచుకోండి..

20-01-2026 మంగళవారం ఫలితాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు...

తర్వాతి కథనం
Show comments