గరిక పోచలతో వినాయక పూజ చేస్తే?

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2022 (12:23 IST)
4
విఘ్నేశ్వరుడిని వినాయక చతుర్థినాడు పూజించే భక్తులకు క్షేమం, లాభం కలుగుతుందని విశ్వాసం. అందువల్ల వినాయక చవితి నాడు చేసే పూజలో ప్రధానమైంది 21 పత్రపూజ అని, వీటిలో గరిక (దూర్వాపత్రం)తో వినాయక స్వామిని పూజించే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. గణనాథుడికి ఎక్కువ ఇష్టమైన గరికను విఘ్నేశ్వర పూజలో జంట గరిక పోచలతో 21 సార్లు పూజించాలి.  
 
యమధర్మరాజు కుమారుడైన అనలాసురుడు.. అగ్ని సంబంధిత తేజస్సుతో పుట్టడం వల్ల అతని శరీరం నుంచి వచ్చే అగ్ని ఆవిరులు లోకాల్ని బాధిస్తుంటాయి. ఆ సమయంలో గణేశుడిని దేవేంద్రుడైన ఇంద్రుడు ప్రార్థించగా.. విఘ్నేశ్వరుడు అనలాసురుడిని నమిలి మింగేస్తాడు.
 
ఫలితంగా గణపయ్య బొజ్జలో అధిక ఉష్ణం జనించి, తాపం కలుగుతుంది. అమృతాలతో అభిషేకించినా ప్రయోజనం ఉండదు. అప్పుడు ముక్కంటి అయిన పరమేశ్వరుడు జంట గరికపోచలతో గణేశ్వరుడిని పూజచేయాలని సూచిస్తాడు. పరమేశ్వరుని సలహాతో దేవతలు గణపతిని పూజిస్తారు. ఆ గరిక పూజతో గణపతి తాపం చల్లారిపోతుంది. అప్పటి నుంచి గణపతికి గరిక ప్రీతిపాత్రమైందని పురోహితులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కోటిన్నర మొబైల్ నంబర్లు బ్లాక్.. అందులో మీ నంబర్ వుందా?

400 మీటర్ల దూరానికి రూ.18 వేలు వసూలు.. ఎక్కడ?

ఈ డ్రెస్సులో నువ్వు కోతిలా వున్నావన్న భర్త, ఆత్మహత్య చేసుకున్న భార్య

సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి వెచ్చించాలి : సీఎం చంద్రబాబు

మీ అక్కను చంపేస్తున్నా.. రికార్డు చేసిపెట్టుకో.. పోలీసులకు ఆధారంగా ఉంటుంది..

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలు, మిరపకాయలు కడితే దిష్టి పోతుందా?

27-01-2026 మంగళవారం ఫలితాలు - జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు...

26-01-2026 సోమవారం ఫలితాలు - శ్రమతో కూడిన ఫలితాలిస్తాయి...

25-01-2026 నుంచి 31-01-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

25-01-2026 ఆదివారం ఫలితాలు - మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు...

తర్వాతి కథనం
Show comments