Webdunia - Bharat's app for daily news and videos

Install App

గణపతికి నచ్చే కుడుములు ఎలా చేయాలంటే..!?

Webdunia
శనివారం, 31 ఆగస్టు 2019 (17:18 IST)
బొజ్జ గణపయ్యకు కుడుములు, ఉండ్రాళ్లంటే మహా ప్రీతి. తొలి పూజ అందుకునే విఘ్నేశ్వరునికి కుడుములు నైవేద్యంగా సమర్పించి పనులకు శ్రీకారం చుడితే ఇక ఏ ఆటంకమూ రాదని పురోహితులు చెబుతున్నారు. ఇంకేముంది..? మీరు కూడా కుడుములు తయారు చేసి బొజ్జ గణపయ్య లొట్టలేసుకుని తినేలా చేయండి.
 
కావలసిన పదార్థాలు:
రవ్వలా కొట్టిన బియ్యపుపిండి - రెండు కప్పులు 
శనగపప్పు - అర కప్పు 
నెయ్యి- ఒక స్పూన్‌
ఉప్పు, నీళ్ళు - తగినంత
 
తయారీ విధానం:
ముందుగా రాత్రిపూటే బియ్యం నానబెట్టుకొని తెల్లారాక మిక్సీలో రవ్వలా వేసుకోవాలి. అలాగే శెనగలను 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టి వేడయ్యాక, అందులో స్పూన్‌ నెయ్యి వేసి శనగపప్పును వేసి కొద్దిగా వేగనివ్వాలి. శనగపప్పు వేగాక వెంటనే నీళ్లు పోసి మరగనివ్వాలి. 
 
అందులో తగిన ఉప్పు వేసి, ఆ తర్వాత బియ్యపుపిండిని వేసి ఉండలు లేకుండా కలియబెట్టుకోవాలి. వెంటనే మూతపెట్టి 4-5 నిమిషాలు ఆవిరిపట్టాలి. నీరంతా పిండి పీల్చేసుకున్నాక స్టౌ మీద నుంచి దించేసుకోవాలి. ఆ పిండితో నచ్చిన సైజులో ఉండలు చేసుకోవాలి. వీటిని ఇడ్లీ ప్లేట్లలో పెట్టి 25 నిమిషాలు ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే... కుడుములు రెడీ..!.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గామ్ ఉగ్రదాడి.. చిక్కుల్లో సీమా హైదర్... పాక్‌కు వెళ్లిపోవాల్సిందేనా?

కాశ్మీర్ నుంచి 6 గంటల్లో 3337 మంది వెళ్లిపోయారు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

నాకో చిన్నపిల్లాడున్నాడు.. దయచేసి వదిలేయండి ప్లీజ్... : భరత్ భూషణ్ ఆఖరి క్షణాలు..

పెళ్లి చేసుకుంటానని హామి ఇచ్చి అత్యాచారం.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం కాస్తా?

Telangana: కర్రెగుట్ట కొండలపై ఎన్‌కౌంటర్: ఆరుగురు మావోయిస్టులు మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

22-04- 2025 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

21-04-05 సోమవారం రాశి ఫలాలు - సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు...

ఆదివారం తేదీ 20-04-05 దిన ఫలాలు - పనులు ఒక పట్టాన సాగవు...

20-04-2025 నుంచి 26-04-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

అన్యమత ప్రచారం- మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్‌‌‌పై బదిలీ వేటు- టీటీడీ

తర్వాతి కథనం
Show comments