Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయకునికి గరికపోచలతో పూజ ఎందుకు? సిద్ధి, బుద్ధిలను గణపతి వాటేసుకున్నాడా?

వినాయక చతుర్థి రోజునే కాకుండా ప్రతిరోజూ విఘ్నేశ్వరుడిని గరికపోచలతో పూజించే వారికి సకల శుభాలు చేకూరుతాయి. అయితే గరికపోచలు విఘ్నేశ్వరునికి ప్రీతిపాత్రం ఎలా అయ్యాయో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే. పూర్వ

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2017 (14:21 IST)
వినాయక చతుర్థి రోజునే కాకుండా ప్రతిరోజూ విఘ్నేశ్వరుడిని గరికపోచలతో పూజించే వారికి సకల శుభాలు చేకూరుతాయి. అయితే గరికపోచలు విఘ్నేశ్వరునికి ప్రీతిపాత్రం ఎలా అయ్యాయో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే. పూర్వం సంయమిని పురంలో జరిగిన ఓ ఉత్సవానికి దేవతలంతా వచ్చారు. ఆ కార్యక్రమంలో తిలోత్తమ నాట్యం అందరినీ ఆకట్టుకుంది. ఆమె అందచందాలు చూసి యముడు మోహించాడు. 
 
అందరూ చూస్తుండగానే తిలోత్తమను కౌగిలించుకున్నాడు. దీంతో నవ్వుల పాలయ్యాడు. అంతేగాకుండా యముడు అవమానానికి గురవడంతో అతని రేతస్సు భూమి మీద పడి వీర వికృత రూపం కలిగిన అనవాసురుడు జన్మిస్తాడు. అతడి అరుపులకు మూడు లోకాలు దద్ధరిల్లాయి. 
 
మంటలు, హాహాకారాలు నలు దిశలా వ్యాపించాయి. అనలాసురుని బారి  నుంచి తప్పించుకునేందుకు దేవతులు శ్రీమన్నారాయణుడిని శరణు వేడారు. మహావిష్ణువు వారిని ఆది దేవుడైన గణపతి వద్దకు తీసుకెళ్లాడు. వినాయకుడు దేవతలకు అనలాసురుని బారి నుంచి రక్షిస్తానని అభయమిచ్చాడు. ఈ క్రమంలో మండుతూ వస్తున్న అనలాసురుడిని గణనాథుడు కొండంత పెరిగి మింగేశాడు. 
 
ముక్కంటి తరహాలోనే వినాయకుడు కూడా అనలాసురుడిని కంఠంలోనే నిలిపేశాడు. అయితే అనలాసురుని తాపం ఏమాత్రం చల్లారలేదు. ఆ తాపాన్ని చల్లార్చేందుకు ఇంద్రుడు చంద్రకళను ఇచ్చినా, బ్రహ్మ సిద్ధి, బుద్ధి అనే కాంతలను ఇచ్చాడు. సిద్ధి బుద్ధిలను వాటేసుకుంటేనైనా గణపతి శరీర తాపం తగ్గుతుందని భావించరు. కానీ ఉపశమనం మాత్రం కలుగలేదు. కానీ సిద్ధిబుద్ధి వినాయకుడనే పేరు మాత్రం వచ్చింది. 
 
విష్ణుమూర్తి రెండు పద్మాలను ఇచ్చాడు. తద్వారా విఘ్నేశ్వరునికి పద్మహస్తుడనే పేరొచ్చింది. శివుడు ఆదిశేషువును ఇచ్చాడు. దాన్ని పొట్టన చుట్టుకోవడంతో వ్యాళబద్ధుడనే పేరు వచ్చింది. కానీ అనలాసురుడిని మింగిన తాపం మాత్రం చల్లారలేదు. విషయం తెలుసుకున్న 80వేలమంది రుషులు ఒకొక్కరు 21 గరిక పోచల చొప్పున 16 లక్షల 80 వేల గరికపోచలు అందజేశారు. వాటితోనే వినాయకుడిని తాపోపశమనం కలుగుతుంది. ఇది గ్రహించిన దేవతలు గణపతిని మెప్పించడానికి గరికపోచలనే వినియోగించేవారని.. అందుకే వినాయకుడికి గరికపోచలతో పూజ చేస్తారని పండితులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్ బ్యాచ్ అంతా ఒకే గూటి పక్షులా?... విజయవాడ జైలులో ఒకే బ్యారక్‌‌లోనే...

పాకిస్థాన్‌కు ఎమ్మెల్యే మద్దతు.. బొక్కలో పడేసిన పోలీసులు.. ఎక్కడ?

Love Story: మహిళకు షాకిచ్చిన యువకుడు.. చివరికి జైలులో చిప్పకూడు

అక్రమ సంబంధం బయటపడుతుందని ప్రియుడితో జతకట్టి భర్తను మట్టుబెట్టిన భార్య!!

పోప్ నివాళి కోసం వాటికన్ సిటీకి వెళ్లిన రాష్ట్రపతి బృందం!!

అన్నీ చూడండి

లేటెస్ట్

23-04-2025 బుధవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

మంగళవారం కుమార స్వామి పూజతో కలిగే ఫలితం ఏంటి?

22-04- 2025 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

21-04-05 సోమవారం రాశి ఫలాలు - సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు...

ఆదివారం తేదీ 20-04-05 దిన ఫలాలు - పనులు ఒక పట్టాన సాగవు...

తర్వాతి కథనం
Show comments