కనులపై మల్లె పువ్వులను ఉంచితే..?

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (13:06 IST)
స్త్రీలు మల్లె పువ్వులను సౌందర్య సాధనంగా ఉపయోగిస్తుంటారు. అవి సౌందర్యానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. మరి అవేంటో ఓసారి పరిశీలిద్దాం.. కొబ్బరి నూనెలో మల్లెపువ్వులు వేసి రాత్రంతా బాగా నానబెట్టి ఆ తరువాత మరిగించుకోవాలి. ఈ నూనె తలకు పట్టిస్తే కురులు ఆరోగ్యవంతంగా మారడమే కాకుండా.. మాడుకు చల్లదనాన్ని చేకూర్చుతాయి. 
 
రోజంతా అలసిపోయిన కనులపై మల్లె పువ్వులను కాసేపు ఉంచినట్టయితే చలవనిస్తాయి. తలలో చుండ్రు ఎక్కువగా ఉంటే మెంతులతో పాటు కొన్ని ఎండిపోయినా మల్లె పువ్వులు కలిపి మెత్తని పేస్ట్‌‍లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకుని గంట తరువాత తలస్నానం చేస్తే చుండ్రు పోతుంది. దాంతో జుట్టు కూడా పట్టు కుచ్చులా పెరుగుతుంది.
 
మల్లె పువ్వుల రసం తీసి గులాబీ పువ్వుల రసం, గుడ్డులోని తెల్లసొనను 2 స్పూన్ల మోతాదులో కలిపి ముఖానికి రాస్తే ముఖం మృదువుగా కాంతివంతంగా మెరిసిపోతుంది. మల్లె పువ్వులతో విటమిన్ సి శరీరానికి కావలసిన ఉష్ణోగ్రతను అందిస్తుంది. మల్లె పువ్వులను ఫేస్‌ప్యాక్‌గా కూడా వాడుకోవచ్చును..
 
పావుకప్పు మల్లె పువ్వులను పేస్ట్‌గా చేసి అందులో కొద్దిగా పాలు కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ బాగా ఆరిన తరువాత ముఖాన్ని ఓ 5 నిమిషాల పాటు మర్దన చేసుకుని ఆ తరువాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వలన ముడతల చర్మం రాదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమర్నాథ్ భక్తులకు షాకింగ్ న్యూస్ - తాత్కాలికంగా యాత్ర నిలిపివేత

తెలంగాణాలో చేతులు కలిపిన బద్ధ శత్రువులు.. ఎవరువారు?

అమ్మవారి విగ్రహంతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న టెక్కీ

ఏపీలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు: మృతులంతా రోగులే...

ఓఆర్ఆర్ రోడ్డు ప్రమాదం, ఫార్చునర్ కారు డివైడర్‌ను ఢీకొని మరో కారుని ఢీకొట్టింది, ఇద్దరు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవకాశాల కోసం దిగజారను : కాజల్ అగర్వాల్

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్న బ్రహ్మయుగం

New Delhi: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల ప్రకటన వెలువడింది

L.B. Sriram: ఆలస్యంగా గుర్తించినందుకు అవమానంగా ఉంది : ఎల్. బి. శ్రీరామ్

Ali: బద్రి లోని హే చికీతా పాట పెద్ద హిట్ అయిందో ఈ సినిమా హిట్ : అలీ

తర్వాతి కథనం
Show comments