Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేసీ ఓ రాక్షసుడంటున్న మహిళా మేయర్.... సూటయ్యే పనులు చేయాలి...

టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర రెడ్డిపై అనంతపురం మేయర్ స్వరూప తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆమె బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, 'కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరిన తర్వాత పార్టీ

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2017 (13:46 IST)
టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర రెడ్డిపై అనంతపురం మేయర్ స్వరూప తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆమె బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, 'కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరిన తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు ఆయనకు ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి ఎంపీ అయితే బాగుంటుందని మేమంతా భావించి ప్రజల కాళ్లు పట్టుకుని ఓట్లు వేయించి గెలిపించాం. కానీ, ఇంత వరకు అనంతపురానికి అర్ధ రూపాయి కూడా ఆయన ఖర్చు పెట్టలేదు. తనకు వచ్చిన నిధులు కూడా ఖర్చు పెట్టలేదని ఆమె ఆరోపించారు. 
 
అంతేకాకుండా, అనంతపురం సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్న ఆయన... చుట్టుపు చూపుగా 3 నెలలకు ఒకసారి నగరానికి వచ్చి తాము చేసిన అభివృద్ధి పనులను చూడకుండా విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన నల్ల అద్దాలు తీసి, తెల్లద్దాలు పెట్టుకోవాలని మేయర్ సూచించారు.  
 
రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటా అని చెబుతున్నారు. ఇలాంటి సమయంలోనైనా మంచి పనులు చేసి విశ్రాంతి తీసుకుంటే బాగుటుందని ఆమె సూచించారు. నల్లద్దాలు పెట్టుకోవడం వల్లే అనంతపురంలో తాము చేసిన అభివృద్ధి పనులు ఆయనకు తెలియడం లేదనీ, అందువల్ల ఆ అద్దాలు తీసి నగరంలో పర్యటిస్తే చేసిన పనులేంటో కనిపిస్తాయన్నారు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments