Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భందాల్చాను ఏం చేద్దామన్న బాలిక.. ద్వారకా తిరుమల తీసుకెళ్లి పెళ్లి చేసుకున్న టీచర్...

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో పాఠాలు బోధించే కీచక మాస్టర్ పాలిటెక్నిక్ చదివే విద్యార్థినిని గర్భవతిని చేశాడు. ఆ తర్వాత ఆ యువతిని ద్వారకా తిరుమల తీసుకెళ్లి మెడలో మూడు ముళ్ల

Webdunia
శుక్రవారం, 24 ఆగస్టు 2018 (14:12 IST)
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో పాఠాలు బోధించే కీచక మాస్టర్ పాలిటెక్నిక్ చదివే విద్యార్థినిని గర్భవతిని చేశాడు. ఆ తర్వాత ఆ యువతిని ద్వారకా తిరుమల తీసుకెళ్లి మెడలో మూడు ముళ్లు వేసి ఇంటికి తీసుకొచ్చాడు. అయితే, ఈ విషయం బయటకు పొక్కడంతో ఆ టీచర్‌ను బాలిక బంధువులు పట్టుకుని చితక్కొట్టిన విషయం తెల్సిందే. ఆ తర్వాత పోలీసులకు పట్టించారు.
 
కర్నూలుకు చెందిన కారె రాంబాబు ఆరేళ్ళుగా ఏలూరులోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఇంగ్లీషు, సైన్సు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఆ పాఠశాలలో పదో తరగతి చదివిన ఓ బాలిక.. ప్రస్తుతం పాలిటెక్నిక్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. రెండేళ్ల నుంచి ఆమెకు మాయమాటలు చెప్పి తన గదికి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడు. 
 
ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. బాధిత విద్యార్థిని రాంబాబును నిలదీయడంతో ద్వారకాతిరుమల తీసుకెళ్లి ఈనెల 18వ తేదీన పెళ్ళి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి ఈనెల 21వ తేదీ రాత్రి ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు రాంబాబుపై దాడి చేసి కొట్టిన ఘటన సంచలనమైన విషయం తెల్సిందే. దీనిపై ఏలూరు పోలీసులు కేసు నమోదు చేసి రాంబాబును అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం