Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో పాటు.. 200 మంది అమ్మాయిలను ఆడుకున్నాడు... నరకం చూపిమరీ...

అతనో ఆర్టీసీ బస్సు డ్రైవర్. కానీ, కట్టుకున్న భార్యతో పాటు ఏకంగా 200 మంది అమ్మాయిలను ఆడుకున్నాడు. అది ఎలాగంటే.. నరకం చూపి మరీ వాడేసుకున్నాడు. 200 మంది అమ్మాయిలను ఆయన ఏ విధంగా వాడుకున్నాడో ఓసారి పరిశీలి

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2017 (12:10 IST)
అతనో ఆర్టీసీ బస్సు డ్రైవర్. కానీ, కట్టుకున్న భార్యతో పాటు ఏకంగా 200 మంది అమ్మాయిలను ఆడుకున్నాడు. అది ఎలాగంటే.. నరకం చూపి మరీ వాడేసుకున్నాడు. 200 మంది అమ్మాయిలను ఆయన ఏ విధంగా వాడుకున్నాడో ఓసారి పరిశీలిద్ధాం. 
 
విజయవాడ రూరల్‌ మండలం యనమలకుదురు గ్రామానికి చెందిన పమిడిపాటి శ్రీనివాసరావు(39) ఆర్టీసీ గవర్నరుపేట డిపోలో కండక్టర్‌. అజిత్‌ సింగ్‌ నగర్‌కు చెందిన పాస్టర్‌ కుమారుడు మార్లపూడి శామ్యుల్‌(30) జులాయి. శ్రీనివాసరావు రూటు నంబర్‌ 48 (అజిత్‌సింగ్‌ నగర్‌) బస్సుపై రెగ్యులర్‌ కండక్టర్‌. ఇదే బస్సులో తరచుగా ప్రయాణం చేయడంతో శామ్యూల్‌తో స్నేహం కుదిరింది.
 
ప్రతి రోజూ బస్సులో ప్రయాణించే మహిళలు, విద్యార్థినుల పాస్‌లను తనిఖీ చేసే సమయంలో వారి ఫోన్లు నంబర్లు శ్రీనివాసరావు నోటు చేసుకునేవాడు. మరికొంతమంది ప్రయాణికులు దిగే హడావుడిలో తమ మొబైళ్లను బస్సులోనే వదిలేస్తుంటారు. అందులోని ఫోన్‌ లిస్టులో ఉన్న మహిళల ఫోన్‌ నంబర్లను అతడు నోట్‌ చేసుకొనేవాడు. 
 
అనంతరం డ్యూటీ దిగాక శామ్యూల్‌తో ఆ సంగతులు పంచుకొనేవాడు. ఇద్దరూ కలిసి ఆ నంబర్లకు బూతు సందేశాలను పంపి పైశాచికానందం పొందేవారు. ఇలా తెలుగు రాష్ట్రాల పరిధిలో వందలమందిని, ఒక్క విజయవాడలోనే రెండు నెలల కాలంలో రెండు వందల అమ్మాయిలను వేధించుకొని తిన్నారు. చివరికి కుటుంబసభ్యులనూ వదిలిపెట్టలేదు. శ్రీనివాసరావు తన భార్యకూ అసభ్య సందేశాలు పంపి.. వికృతానందం పొందేవాడు. చివరకు ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి... శ్రీనివాసరావును అరెస్టు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments