Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధిక ఉష్ణోగ్ర‌త‌లు... 3 రోజుల పాటు పాఠ‌శాల‌ల‌కు సెల‌వులు: మంత్రి గంటా

అమ‌రావ‌తి: రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్ర‌త‌ల నేప‌థ్యంలో విద్యాశాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. విద్యార్థుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా... 3 రోజుల పాటు అన్ని పాఠ‌శాల‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించింది. రాష్ట్రం లోని అన్ని పాఠ‌శాల‌ల‌కు రేప‌టి నుంచి ఈ నెల‌ 21 వ‌ర‌కు సెల‌వ

Webdunia
సోమవారం, 18 జూన్ 2018 (21:45 IST)
అమ‌రావ‌తి: రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్ర‌త‌ల నేప‌థ్యంలో విద్యాశాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. విద్యార్థుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా... 3 రోజుల పాటు అన్ని పాఠ‌శాల‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించింది. రాష్ట్రం లోని అన్ని పాఠ‌శాల‌ల‌కు రేప‌టి నుంచి ఈ నెల‌ 21 వ‌ర‌కు సెల‌వులు ఇస్తున్న‌ట్లు రాష్ట్ర మాన‌వ వ‌న‌రుల  అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస‌రావు సోమ‌వారం ప్ర‌క‌టించారు. 
 
అధిక ఉష్ణోగ్ర‌త‌లు, వేడిగాలులు నేప‌థ్యంలో పాఠశాల‌ల‌కు సెల‌వుల ఇస్తున్నామ‌ని చెప్పారు. మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్ర‌త‌లు వుంటాయ‌ని  వాత‌వ‌ర‌ణశాఖ హెచ్చ‌రింపుల నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు. సోమ‌వారం కూడా అధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయ‌ని,  వాత‌వ‌ర‌ణశాఖ సూచ‌న‌లు, హెచ్చ‌రింపుల‌ నేప‌థ్యంలో పాఠ‌శాల‌ల‌కు సెల‌వుల ప్ర‌క‌టిస్తున్నామ‌ని మంత్రి గంటా తెలిపారు. 
 
త‌ప్ప‌నిస‌రిగా ప్రైవేట్, కార్పోరేట్ పాఠ‌శాల‌లు కూడా విద్యార్థుల‌కు సెల‌వులు ఇవ్వాల్సిందేన‌న్నారు. సెల‌వుల్లో ప్రైవేట్, కార్పోరేట్ పాఠ‌శాల‌లు త‌ర‌గ‌తులు నిర్వ‌హించిన‌ట్ల‌యితే గుర్తింపు ర‌ద్దు చేస్తామ‌ని మంత్రి గంటా శ్రీనివాస‌రావు స్ప‌ష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments