Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాక్టర్ ప్రియాంక రెడ్డి కేసులో నిందితులను ఉరి తీయాల్సిందే..

Webdunia
శనివారం, 30 నవంబరు 2019 (15:10 IST)
రంగారెడ్డి జిల్లా షాద్ నగరులో జరిగినా డాక్టర్ ప్రియాంక రెడ్డిహత్య కేసులో నిందితులను షాద్ నగర్ కోర్టుకు హాజరు పరిచేందుకు పోలీసులు స్టేషన్‌కు తీసుకువచ్చారు అయితే నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. వైద్యురాలి హత్య ఘటనపై షాద్‌నగర్ అట్టుడికిపోతోంది. 
 
నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఉరితీయాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వినపడుతోంది. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట మహిళలు, ప్రజా సంఘాలు, స్థానికులు నిరసనకు దిగారు. నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేస్తూ.. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. 
 
మరోవైపు హత్యాచార ఘటనపై తెలుగు రాష్ట్రాల్లోని మహిళా, ప్రజాసంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. నిందితులను ఉరితియ్యాలంటూ పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు చేపట్టాయి. ఇదిలా ఉంటే నిందితులకు న్యాయసహాయం చేయబోమని జిల్లా బార్ కౌన్సిల్ ప్రకటించింది. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామని తెలిపింది. వైద్యురాలిని పక్కా స్కెచ్‌తోనే నిందితులు హత్య చేశారని పోలీసులు తెలిపిన విషయం తెలిసిందే. 
 
మద్యం మత్తులో నలుగురు యువకులు ఈ ఘోరానికి పాల్పడినట్లు తేల్చారు. ఈ కిరాతకానికి సంబంధించి నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం జక్లేర్‌కు చెందిన లారీ డ్రైవర్‌ మహ్మద్‌ ఆరిఫ్‌ (26), లారీ క్లీనర్‌ శివ (20); అదే మండలం గుడిగండ్లకు చెందిన లారీ క్లీనర్‌ నవీన్‌ (23); మరో క్లీనర్‌ చింతకుంట చెన్నకేశవులు (20) నిందితులని తెలిపారు. 
 
సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ శుక్రవారం శంషాబాద్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టారు.

షాద్ నగర్ పోలీసు స్టేషను ముందు ఆందోళన
లాఠీచార్జి షాద్ నగర్ పోలీసు స్టేషను ముందు నిందితులను తమకు అప్పగించాలని ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు నచ్చజెప్పినా ఆందోళన కారులు వినకపోవడం చేత లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఆందోళన కారులను పోలీసులు చెదరగొట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

No Telugu: పబ్లిసిటీలో ఎక్కడా తెలుగుదనం లేని #సింగిల్ సినిమా పోస్టర్లు

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments