Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా రెండో భర్తతో పడుకుని బిడ్డను కనివ్వు.. కోడలికి అత్త వేధింపులు.. భర్త సపోర్టు

హైదరాబాద్‌లో ఓ దారుణం వెలుగు చూసింది. తన రెండో భర్తతో పడుకుని ఓ బిడ్డకు జన్మనివ్వాలంటూ కోడలిని ఓ గయ్యాళి అత్త వేధించింది. దీనికి కట్టుకున్న భర్త కూడా మద్దతివ్వడం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వ

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2017 (13:12 IST)
హైదరాబాద్‌లో ఓ దారుణం వెలుగు చూసింది. తన రెండో భర్తతో పడుకుని ఓ బిడ్డకు జన్మనివ్వాలంటూ కోడలిని ఓ గయ్యాళి అత్త వేధించింది. దీనికి కట్టుకున్న భర్త కూడా మద్దతివ్వడం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే హైదరాబాద్‌కు చెందిన సుమానియా షర్ఫీ అనే మహిళకు గత 2015లో వివాహమైంది. ఆ తర్వాత భర్తతో కలిసి దుబాయ్‌కు వెళ్లింది. అక్కడ ఓ నెల రోజులు గడిపిన తర్వాత తిరిగి హైదరాబాద్‌కు వచ్చింది. 
 
ఇక్కడకు వచ్చాక ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. రెండో భర్తకు బిడ్డను కనివ్వాలంటూ తన భర్తకు గార్డియన్‌గా, తనకు అత్త స్థానంలో ఉన్న మహిళ చిత్రహింసలు పెడుతూ హింసిస్తూ వచ్చింది. ఈ విషయం భర్త దృష్టికి తీసుకెళ్లినా ఆయన కూడా సవతి తల్లికే మద్దతిచ్చాడు. 
 
అత్త కోర్కె మేరకు ఆమె భర్త కోర్కె తీర్చనందుకు, సరిగ్గా ఆహారం కూడా పెట్టేవారు కాదనీ, ఒ దశలో గదిలో బంధించి లైంగికంగా వేధించారని తన గోడును వెళ్లబోసుకుంది. ఆపై వాట్స్‌యాప్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పి వదిలించుకోవాలని ప్రయత్నించారని వెల్లడించింది. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
బాధితురాలు సుమానియా షర్ఫీ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పరిధిలోని సనత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆమె భర్త ఓవైసీ తాలిబ్‌పై ఐపీసీ సెక్షన్ 420, 406, 506 ఆర్‌డబ్ల్యూల కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం