Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు జరిగితీరుతాయ్ అంతే.. మంత్రి

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (10:14 IST)
ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించి తీరుతామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామన్నదానిపైనా ఆయన క్లారిటీ ఇచ్చారు. వచ్చేనెల మొదటి వారంలో ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్టు స్పష్టం చేశారు. 
 
అలాగే జులై చివరి వారంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశముందన్నారు. తేదీలను కూడా అతి త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకున్నామని.. విద్యాశాఖ అధికారులు సైతం పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారని.. ఉపాధ్యాయులతో కూడా చర్చించడం జరిగిందన్నారు. అయితే సీఎం జగన్‌తో చర్చించి పరీక్షల తేదీ, ఏర్పాట్లపై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.
 
ప్రస్తుతం ఏపీలో భారీగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో జులైలో పరీక్షలు నిర్వహించాలని ఏపీ విద్యాశాఖ భావిస్తోంది అన్నారు. సిబ్బంది సైతం అంతా సిద్ధంగానే ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు. అన్ని అనుకున్నట్టు కుదిరితే వచ్చేనెల మొదటి వారంలో ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్టు మంత్రి సురేశ్‌ తెలిపారు. జులై చివరి వారంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశముందన్నారు.
 
 విద్యార్థుల ప్రయోజనం కోసమే... కరోనా సవాళ్ల మధ్య కూడా పరీక్షలు నిర్వహస్తున్నామని వివరణ ఇచ్చారు. అలాగే 1998 డీఎస్సీ అభ్యర్థుల సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి సురేశ్‌ వెల్లడించారు. 36 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎన్నో బాయ్‌ఫ్రెండ్' అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు : శృతిహాసన్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ల కిష్కింధపురి ఫస్ట్ లుక్

Sridevi: ఆరోజునే 3డీలోనూ జగదేక వీరుడు అతిలోక సుందరి రీరిలీజ్

SS Rajamouli: నా ఎక్స్పెక్ట్ కు మించి నాని చాలా ముందుకు వెళ్లిపోయాడు : ఎస్ఎస్ రాజమౌళి

వరుసగా అలాంటి పాత్రలు రావడానికి కారణం ప్లస్ సైజులో ఉండటమే : అశ్రిత వేమగంటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments