Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పేదల రక్తం తాగుతున్నారు: జవహర్

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (10:34 IST)
మద్యపాన నిషేదం పేరుతో మహిళల ఓట్లు దండుకున్న సీఎం జగన్.. మద్యం అమ్మకాలు, రేట్లు పెంచి మహిళల తాళిబొట్లు తెంచుతున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ విమర్శించారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం మద్యం ధరలు పెంచి పేదల రక్తం తాగుతున్నారన్నారు. మద్యం రేట్లు పెరగడంతో సామాన్యులు తన రోజు కూలీ మొత్తం మద్యానికే ఖర్చు చేస్తూ వారి కుటుంబాల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు.

మద్యానికి అలవాటుపడిన వారు మద్యలో మానలేక, పెరిగిన ధరలకు మద్యం కొనలేక డబ్బుల కోసం ఇంట్లో మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారని, మరికొంత మంది శానిటైజర్ తాగి చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

విజయవాడలో ఇవాళ ఇద్దరు శానిటైజర్ తాగి చనిపోయారని జవహర్ అన్నారు. మద్యం రేట్లు పెరిగాక రాష్ట్రంలో శానిటైజర్, నాటుసారా తాగి సుమారు 50 మంది చనిపోయారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు.

పక్కనున్న తెలంగాణలో దేశంలో లభించే బ్రాండ్లన్నీ లభిస్తుంటే ఏపీలో మాత్రం జగన్ సొంత బ్రాండ్లు మాత్రమే దొరుకుతున్నాయని విమర్శించారు.

రాష్ట్రంలో వైసీపీ నేతలు, వాలంటీర్లే మద్యం మాఫియాను పెంచి పోషిస్తున్నారని, మద్యం రేట్లు పెంచి, అమ్మకాలు పెంచి ప్రభుత్వానికి ఖజానా నింపుకోవాలన్న ధ్యాస తప్ప మద్యపాన నిషేధం అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదని ప్రజలకు అర్ధమైందని జవహర్ వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments