Webdunia - Bharat's app for daily news and videos

Install App

చోరీలు చేయడం ఎలా? యూట్యూబ్‌లో చూసి నేర్చుకుని...

ఠాగూర్
గురువారం, 9 జనవరి 2025 (10:44 IST)
చోరీ చేయడం కూడా ఓ కళే. అందుకే కొందరు యువకులు చోరీలు చోరీలు చేస్తూ సులభంగా పట్టుబడిపోతుంటారు. అయితే, ఈ యువకుడు మాత్రం చోరీ చేస్తూ చిక్కకుండా ఉండేందుకు వీలుగా అసలు చోరీ ఎలా చేయాలన్న విషయంపై యూట్యూబ్‌లో అనేక వీడియోలను చూశాడు. అలా వీడియోలు చూసి చోరీ కళను నేర్చుకున్న ఓ వ్యక్తి కేవలం నెల రోజుల్లో రెండు చోరీలు చేసి జైలుపాలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి స్టేషన్‌ పరిధిలో జరిగింది. 
 
కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన కొట్టి సాయిరాం (28)పై ముమ్మిడివరం పోలీస్ స్టేషనులో బైకులు, ట్రాక్టర్ టైర్ల దొంగతనం కేసులతోపాటు రోడ్డు ప్రమాద కేసులు ఉన్నాయి. దీంతో అక్కడి పోలీసుల వేధింపుల నుంచి తప్పించుకునేందుకు నెల రోజుల క్రితం హైదరాబాద్ వచ్చాడు. కేపీహెచ్‌బీలోని ఓ హాస్టల్లో ఉంటూ ప్రశాంత నగర్‌లోని ఓ కంపెనీలో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు.
 
సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నా తన బుద్ధి పోనిచ్చుకోని సాయిరాం.. యూట్యూబ్‌లో చూసి చోరీలు ఎలా చేయాలో నేర్చుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 4న వివేకానంద నగర్‌లో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న యువతి మెడలోని 8 తులాల గొలుసును లాక్కుని పరారయ్యాడు. అంతకుముందు రోజే తన బైక్ చోరీకి గురైనట్టు మోహన్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు.
 
రంగంలోకి దిగిన పోలీసులు చోరీ చేసిన బైకునే గొలుసు దొంగతనం జరిగినట్టు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా గుర్తించారు. మరోవైపు, చోరీ చేసిన గొలుసును తాకట్టుపెట్టిన నిందితుడు సాయిరాం రూ.40 వేలు తీసుకున్నాడు. అతడిని అరెస్టు చేసిన పోలీసులు గొలుసు, బైక్, ఫోన్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' బెనిఫిట్ షోకు తెలంగాణ సర్కారు అనుమతి నిరాకరణ!!

రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్సా? మరి నువ్వేంటి?: సారీ చెప్పిన శ్రీముఖి (Video)

ట్రోలింగ్‌కు దారితీసిన అనంత శ్రీరామ్ ప్రసంగం!!

తాతయ్య బాలయ్యకు ఇంకా ఇలాంటి సీన్లు, డ్యాన్సులు అవసరమా?

హిందూయిజం సారాంశంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రం హైందవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments