Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయం కిక్కులో మంత్రి పెద్దిరెడ్డి, అవి కూడా పెట్టేయాలని నిమ్మగడ్డకు విజ్ఞప్తి

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (11:42 IST)
విజయం సాధిస్తుంటే వచ్చే ఆనందమే వేరు. క్రికెట్ ఆటలో చూడండి.. ఇక మనం గెలుస్తాం అని అనుకుంటే ఛాతీ విప్పారుతుంది. విజయదరహాసం తొణకిసలాడుతుంది. వరుస విజయాలు లభిస్తుంటే ఆ కిక్కే వేరు. ఇప్పుడు అలాంటి కిక్కులో వున్నారు వైసిపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు.
 
తిరుపతి లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ రాగానే మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు. ఈ ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి కనీసం 3 లక్షల బంపర్ మెజారిటీతో విజయం సాధిస్తారన్న నమ్మకముందన్నారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటర్లు సుమారు 16 లక్షల వరకూ వున్నారు. మంత్రి లెక్కల ప్రకారం కనీసం 10 లక్షల ఓటర్లు వైసిపి పక్షాన వున్నట్లే.
 
ఇకపోతే పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన క్రమంలో పనిలోపనిగా వెంటనే జెడ్పీ, ఎంపిటిసి ఎన్నికలు కూడా పెట్టేయాలని పెద్దిరెడ్డి అన్నారు. ఎస్ఇసి నిమ్మగడ్డ రమేష్ హయాంలోనే ఈ ఎన్నికలు కూడా జరిగిపోతే ఆ తర్వాత తాము వ్యాక్సిన్ ప్రోగ్రాం చేసుకుంటామన్నారు. వెంటనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే వారం రోజుల్లో ముగించేస్తామన్నారు. మరి ఎస్ఇసి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments